తెలుగు అకాడమీ స్కామ్ నిందితులు వీరే :రూ.324 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్

Published : Oct 06, 2021, 01:05 PM ISTUpdated : Oct 06, 2021, 01:39 PM IST
తెలుగు అకాడమీ స్కామ్ నిందితులు వీరే :రూ.324 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్

సారాంశం

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ లో అరెస్టుల సంఖ్య  పదికి చేరింది. సుమారు రూ. 64  కోట్లకు పైగా నిధులను నిందితులు స్వాహా చేశారని సీసీఎస్ పోలీసులు గుర్తించారు.   Telugu akademi నిధుల స్వాహా కేసులో తాజాగా ఆరుగురిని అరెస్ట్ చేయడంతో మొత్తం ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య పదికి చేరుకొంది.  


హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ లో అరెస్టుల సంఖ్య  పదికి చేరింది. సుమారు రూ. 64  కోట్లకు పైగా నిధులను నిందితులు స్వాహా చేశారని సీసీఎస్ పోలీసులు గుర్తించారు.   Telugu akademi నిధుల స్వాహా కేసులో తాజాగా ఆరుగురిని అరెస్ట్ చేయడంతో మొత్తం ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య పదికి చేరుకొంది.ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలుగు అకాడమీలో సుమారు . రూ. 324 కోట్ల నిధులను డ్రా చేయాలని ముఠా సభ్యులు ప్లాన్ చేశారని ccs పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

కేసులో ప్రధాన నిందితుడు మస్తాన్ వలీ (యూనియన్ బ్యాంక్ మేనేజర్), ఏ2 రాజ్ కుమార్ (ఏజెంట్), ఏ3 సత్యనారాయణ రాజు (ఏపీ మర్కంటైల్ బ్యాంక్),  ఏ4 పద్మావతి (మర్కంటైల్ బ్యాంక్), ఏ5 మొయినుద్దీన్ (మర్కంటైల్ బ్యాంక్, ఏ6 చందురి వెంకటసాయి (ఏజెంట్), ఏ7 నందురి వెంకట (ఏజెంట్), ఏ8 వెంకటేశ్వర రావు (ఏజెంట్), ఏ9 రమేష్ (తెలుగు అకాడమీ ఏసీవో), ఏ10 సదన (కెనరా బ్యాంక్)

ఈ ఏడాది సంక్రాంతి నుంచి సెప్టెంబర్ వరకు మూడు బ్యాంకుల నుంచి 64 కోట్లు కొల్లగొట్టారు. వచ్చే డిసెంబర్ నాటికి తెలుగు అకాడమీకి చెందిన మొత్తం 324 కోట్లు కొట్టేయాలని స్కెచ్ వేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

also read:తెలుగు అకాడమీ అస్తవ్యస్తం: నిధుల కుంభకోణానికి పునాదులు ఇవీ....

తెలుగు అకాడమీకి చెందిన తాజా మాజీ డైరెక్టర్ somi reddy, గతంలో డైరెక్టర్ గా పనిచేసిన సత్యనారాయణలను సీసీఎస్ పోలీసులు విచారించారు.మూడు బ్యాంకుల నుండి రూ. 64 కోట్లను నిందితులు డ్రా చేశారని పోలీసులు గుర్తించారు.

ఈ ఏడాది జనవరి నుండి తెలుగు అకాడమీ నుండి  నిధుల స్వాహాకు నిందితులు శ్రీకారం చుట్టారని సీసీఎస్ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ ముఠా సభ్యుల నుండి కొంత నగదును పోలీసులు సీజ్ చేశారు.

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ లో బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీని పోలీసులు పేర్కొన్నారు.సత్యనారాయణరాజు పద్మావతి, మొయినొద్దిన్, చందురి వెంకటసాయి, శ్రీనివాస్,  రాజ్ కుమార్,  సోమశేఖర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహరం వెలుగు చూడడంతో  డైరెక్టర్ గా ఉన్న సోమిరెడ్డిని ప్రభుత్వం ఇటీవలే ఆయనను డైరెక్టర్ పదవి నుండి తప్పించింది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BRS Boycotts Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట బిఆర్ఎస్ నాయకుల నిరసన| Asianet News Telugu
Kavitha Pressmeet: నా రక్తం ఉడుకుతోంది KCRపై CMరేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కవిత | Asianet News Telugu