
యూపీలో జరిగిన ఘటనలో రైతులు చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి Manickam Tagore వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మిస్టర్ 20పర్సెంట్... 48 గంటలు ఆలస్యంగా మేల్కొని షాక్ కు గురయ్యారు అన్నారు.
కానీ lakhimpur kheri లో రైతుల చావుకు కారణమైన కారు నడిపిన కేంద్ర మంత్రి Ajay Kumar Mishra కొడుకు ను అరెస్టు చేయాలని, ఆ మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసే ధైర్యం కూడా KTRకు లేకుండా పోయిందని మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. కేటీఆర్ ముసలి కన్నీళ్లు పనిచేయవని, ధైర్యం కావాలని ఠాగూర్ ట్వీట్ చేశారు.
కాగా, లఖింపూర్ కేరి ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందించారు. రైతులను అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో ఆరోపించారు. అన్నదాతలను చంపిన తీరు భయానకంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. అనాగరికమైన ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రైతు హత్యలకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, ఆదివారం, లఖ్‌నపూర్ నుండి నాలుగు గంటల దూరంలో ఉన్న లఖింపూర్ ఖేరీలో రైతులు ఒక కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను ఘెరావ్ చేశారు. ఆ సమయంలో మంత్రి కాన్వాయ్‌లో ఒక ఎస్‌యూవీ నిరసనకారుల బృందం మీదికి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు.
ఘటన జరిగిన సమయంలో ఎస్‌యూవీని కేంద్రమంత్రి మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడని రైతులు ఆరోపిస్తూ మృతదేహాలతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు ఆశిష్ మిశ్రాపై హత్యారోపణలు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కానీ, అతడిని ఇంకా అరెస్టు చేయలేదు. ఈ సంఘటనకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది.
Priyanka Gandhi Arrest : ఆమె ‘నిర్భయ’.. ‘అసలైన కాంగ్రెస్ వాది’... రాహుల్ గాంధీ ట్వీట్...
సోమవారం, లఖింపూర్‌లో జరిగిన ఘటనకు మద్ధతుగా బయలు దేరిన ప్రియాంకాగాంధీ, అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీలో కూడా మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్రదర్శనలు నిర్వహించారు.
అయితే, ఘటనకు కారణంగా చెబుతున్న మిశ్రా మాత్రం ఎనిమిది మందిపైకి దూసుకెళ్లిన కారులో తాను లేనని ఖండించారు. "నేను కారులో లేను. రెజ్లింగ్ మ్యాచ్ జరుగుతున్న బన్వీర్‌పూర్ గ్రామంలోని మా పూర్వీకుల ఇంట్లో ఉన్నాను. ఉదయం నుండి ఈవెంట్ ముగిసే వరకు నేను అక్కడే ఉన్నాను" అని అతను చెప్పుకొచ్చాడు.