నాగర్ కర్నూల్: కాలువలోకి దూసుకెళ్లిన బైక్... ఇద్దరు యువకులు జలసమాధి

Published : Oct 06, 2021, 11:57 AM ISTUpdated : Oct 06, 2021, 12:08 PM IST
నాగర్ కర్నూల్: కాలువలోకి దూసుకెళ్లిన బైక్... ఇద్దరు యువకులు జలసమాధి

సారాంశం

బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు జలసమాధి అయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నాగర్‌కర్నూల్: బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న నీటి కాలువలోకి దూసుకెళ్ళి ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కాలువలో నీరు అధికంగా వుండటం, యువకులిద్దరికీ ఈత రాకపోవడంతో నీటమునిగి చనిపోయారు. 

వివరాల్లోకి వెళితే... nagar kurnool జిల్లా రంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు(25), నరేష్(20) స్నేహితులు. వీరిద్దరు బైక్ పై వెళుతుండగా చౌదర్ పల్లి సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు జలసమాధి అయ్యారు. 

read more  హైదరాబాద్ లో ఘోర రోడ్డుప్రమాదం... కారును ఢీకొన్న టిప్పర్, హెడ్ కానిస్టేబుల్ మృతి

read more  రోడ్డు ప్రమాదం: కారును ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన బస్సు, కారు డ్రైవర్ మృతి

 ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కాలువలోంచి యువకులు మృతదేహాలతో పాటు  బైక్ ను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో