జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ నిర్వహించనుంది.
హైదరాబాద్: Jubileehills gang rape కేసులో జువైనల్ హోంలో ఉన్న నిందితులు Bail పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను Juvenile court, విచారించనుంది.జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితులున్నారని హైద్రాబాద్ సీపీ CV Anand తెలిపారు. ఐదుగురు నిందితులు మైనర్ బాలికపై అత్యాచారం చేశారని , ఒకరు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించారని Hyderabad CP సీపీ ఆనంద్ వివరించారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులన వారం రోజుల Custody కి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను కోర్టు మంగళవారం నాడు వింది. ఈ కేసులో ఏ1 నిందితుడిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఏ 1 నిందితుడిని రేపు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. జువైనల్ హోంలో ఉన్న నిందితులు బెయిల్ పిటిషన్ పై జువైనల్ కోర్టు విచారణ నిర్వహించనుంది.
undefined
ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.
అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని Telangana రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.
కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.
also read:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: మైనర్లకు వాహనాలిచ్చిన పేరేంట్స్ పై కేసు నమోదుకి చాన్స్
ఈ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో మైనర్ బాలిక ఫోటోలు విడుదల చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది.