జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: మైనర్లకు వాహనాలిచ్చిన పేరేంట్స్ పై కేసు నమోదుకి చాన్స్

హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ లో మైనర్లను అనుమతించడంపై ఎక్సైజ్ శాఖను పోలీస్ శాఖ నివేదిక కోరింది. మరో వైపు మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు మైనర్ల కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయనున్నారు.
 

Hyderabad Police Plans to register case against the parents who gave vehicles to the minors

హైదరాబాద్: Hyderabad నగరంలోని Jubileehills లోని Amnesia  పబ్‌లోకి మైనర్లను అనుమతించడం పై పోలీస్ శాఖ Excise శాఖను నివేదిక కోరింది.  పబ్‌లలోకి  మైనర్లను అనుమతి లేదని కూడా  అధికారులు చెబుతున్నా కూడా పబ్  యాజమాన్యాలు మైనర్లను పబ్ లలోకి అనుమతిస్తున్న ఘటనలు గతంలో కూడా చోటు చేసుకొన్నాయి. ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 గెట్ టూ గెదర్ పార్టీ కావడంతో నాన్ లిక్కర్ పార్టీ కోసం  ఈ బప్ ను బుక్ చేసుకొన్నట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. నగరంలోని ఓ కార్పోరేట్ స్కూల్ ఈ పబ్ ను బుక్ చేసిందని పోలీసులు గుర్తించారు. మే 28వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తమ పబ్ లో లిక్కర్ ఓపెన్ చేయలేదని పబ్ మేనేజర్ సాయి ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పబ్ నుండి విద్యార్ధులు బయటకు వెళ్లిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు లిక్కర్ ఓపెన్ చేసినట్టుగా సాయి ఆ ఇంటర్వ్యూలో వివరించారు. 

పబ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మైనర్ బాలికను కారులో తీసుకెళ్లిన నిందితులు కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు ప్రకటించారు.ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. 

మరో వైపు ఈ కేసులో మరో కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. Minorsకు వాహనాలు ఇచ్చిన పేరేంట్స్ పై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే  తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని గతంలోనే పోలీసుశాఖ ప్రకటించింది.ఈ కేసులో మైనర్లున్నందున వారికి వాహనాలు ఇచ్చిన పేరేంట్స్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో  గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని Telangana రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios