గంటలో పెళ్లి.. కట్నం డబ్బులు, బంగారంతో వరుడు పరార్...

By SumaBala BukkaFirst Published Dec 16, 2021, 3:22 PM IST
Highlights

సరిగ్గా పెళ్లికి ఒక గంట ముందు.. వరుడు ఉడాయించాడు. కట్నం పైసలతో.. పత్తా లేకుండాపోయాడు. దీంతో గత ఆదివారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతిని పక్కనే ఉన్న కొండాపూర్ మండలం మల్కాపూర్ కు చెందిన మాణిక్ రెడ్డికి ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఓ ఘరానా మోసం బయటపడింది. ఓ వరుడు పెళ్లికి గంటముందు కట్నం డబ్బులతో ఉడాయించాడు. వివరాల్లోకి వెడితే..పెళ్లికి సంబంధించి మాటా ముచ్చటా అంతా పూర్తయ్యింది. గ్రాండ్ గా Marriage జరిపేందుకు వధువు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. వరుడికి  Dowryగా రూ. 25లక్షల నగదు, 25 తులాల బంగారం ఇచ్చారు. ఈ నెల 12న పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. అయితే, సరిగ్గా పెళ్లికి ఒక గంట ముందు.. వరుడు ఉడాయించాడు.

కట్నం పైసలతో.. పత్తా లేకుండాపోయాడు. దీంతో గత ఆదివారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతిని పక్కనే ఉన్న కొండాపూర్ మండలం మల్కాపూర్ కు చెందిన మాణిక్ రెడ్డికి ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. 

Telangana Omicron cases : టోలిచౌకి పారామౌంట్ కాలనీలో కంటైన్మెంట్ జోన్

ఆగస్ట్ 27న వీరికి Engagement కూడా జరిగింది. 25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని వరుడికి కట్నం కింద ఇచ్చారు. ఈ నెల 12న వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. Sangareddy చౌరస్తాలోని ఓ Kalyana mandapamలో వేదిక కూడా ఏర్పాటు చేశారు. అయితే, వివాహానికి గంట ముందు కట్నం డబ్బులు, బంగారంతో వరుడు ఉడాయించాడు. ఆ తర్వాత మానిక్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో వధువు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. 

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లోని శింగనమలో నవంబర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. రెండు గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ మండపం  ఒక్కసారిగా మూగబోయింది. వరుడు కనిపించడం లేదంటూ కుటుంబీకులు చెప్పడంతో  అంత ఆందోళనకు గురయ్యారు.  శింగనమల మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని  ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిర్ణయించారు.

హైద్రాబాద్‌లో డ్రగ్స్ తరలిస్తూ ముగ్గురి అరెస్ట్: నిందితుల్లో మహిళా టెక్కీ

నవంబర్ 9వ తేదీ ముహూర్తం,  పదవ తేదీ బుధవారం 10 గంటలకు వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. brideను తీసుకుని బంధువులు మంగళవారం రాత్రికే వరుడి స్వగ్రామానికి చేరుకొన్నారు. ఉదయం tiffine ఆరగించి వధువును పెళ్లికి సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

8 గంటల సమయంలో వరుడు చెప్పులు సరిగా లేవు.. పామిడికి వెళ్లి మార్చుకొస్తానని ద్విచక్ర వాహనంలో ఒంటరిగా వెళ్లిపోయాడు. marriage సమయం దగ్గర పడుతున్నా అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు గాలించినా ఫలితం లేకపోయింది. చిరవకు సాయంత్రం వరుడి ఆచూకీని కనుగొని గ్రామ పెద్దల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఈ వివాహం ఇష్టం లేదని అతడు చెప్పినట్లు సమాచారం. గ్రామపెద్దలు ఇరు కుటుంబాలతో చర్చలు జరిపి వివాహం రద్దు చేసినట్లు తెలిసింది. 

click me!