మత్తు పానీయం ఇచ్చి అనాథాశ్రమంలో దాత రేప్: బాలిక మృతి

By telugu teamFirst Published Aug 13, 2020, 6:59 AM IST
Highlights

అమీన్ పూర్ లో గల ఓ అనాథాశ్రమంలో ఘోరం జరిగింది. అనాథాశ్రమానికి విరాళాలు ఇచ్చే ఓ వ్యక్తి ఆ ఆశ్రమంలోని బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. దీంతో ఆ బాలిక మరణించింది.

హైదరాబాద్: తెలంగాణలోని ఓ అనాథాశ్రమంలో జరిగిన ఘోరానికి 14 ఏళ్ల వయస్సు గల బాలిక బలైంది. నిర్వాహకులతో సహకారంతో అనాథాశ్రమంలోని బాలికపై దాత వేణుగోపాల్ రెడ్డి వరుసగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. అతను రాగానే బాలికను అనాథాశ్రమం నిర్వాహకులు అతని గదిలోకి పంపించేవారు. 

అతను ఆమెకు మత్తుపానీయం ఇచ్చి అత్యాచారం చేస్తూ వచ్చాడు తనకు తల్లిదండ్రులు లేరు కాబాట్టి తనపై దాడి చేశారని, వాళ్లను జైల్లో పెట్టేందుకు న్యాయవాదిని అయవుతానని ఆ బాలిక అనడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ బాలిక నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొంద్ుతూ మరణించింది. 

అమీన్ పూర్ లోని ఏ ప్రైవేట్ అనాథ శరణాలయంలో ఐదో తరగతి చదువుతున్న బాలిక వేసవి సెలవులు, లాక్ డౌన్ వల్ల బోయిన్ పల్లిలోని తన చిన్నమ్మ ఇంటికి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను వైద్యులకు చూపించారు. ఆమె లైంగిక దాడికి గురైనట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. దాంతో బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిర్యాదు చేశారు.

కేసు బోయిన్ పల్లి నుంచి అమీన్ పూర్ పోలీసు స్టేషన్ కు బదిలీ అయింది. దాంతో పోలీసులు వేణుగోపాల్ రెడ్డిని, అనాథ శరణాలయం నిర్వాహకులు విజయ, జయదీప్ లను అరెస్టు చేశారు. శరణాలయంలో ఐదో అంతస్థుకు దాత వేణు గోపాల్ రెడ్డి వచ్చినప్పుడు నిర్వాహకులు బాలికను ఆ గదిలోకి పంపించేవారని, పానీయం తాగడంతో బాలికకు స్పృహ ఉండేది కాదని ఎఫ్ఐఆర్ లో నమోదైంది. 

స్పృహ వచ్చిన తర్వాత చూసుకుంటే ఒంటిపై దుస్తులు ఉండేవి కావని, , ఎవరికీ చెప్పవద్దంటూ వార్డెన్ బెదిరించేదని బాలిక వాంగ్మూలం ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. 

click me!