గాంధీలో గ్యాంగ్ రేప్: కన్పించకుండా పోయిన మహిళ కోసం ఆసుపత్రిలో గాలింపు

By narsimha lodeFirst Published Aug 18, 2021, 3:34 PM IST
Highlights


గాంధీ ఆసుపత్రిలో పోలీసులు బుధవారం నాడు సెర్చింగ్ ఆపరేషన్ చేశారు. నాలుగు రోజులుగా కన్పించకుండా పోయిన గ్యాంగ్ రేప్ బాధితురాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలోని 350 గదులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

హైదరాబాద్: నాలుగు రోజులుగా కన్పించకుండా గ్యాంగ్ రేప్ బాధితురాలి కోసం గాంధీ ఆసుపత్రిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజులుగా ఆమె ఆచూకీ లేకుండా పోయింది.  

గాంధీ ఆసుపత్రిలోని 10 అంతస్లుల్లోని ప్రతి గదిని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.తనతో పాటు తన అక్కపై కూడ రేడియాలజీ విభాగంలో పనిచేసే ఉమా మహేశ్వర్ సహా మరో  ఆరుగురు గ్యాంగ్ రేప్  చేశారని కన్పించకుండా పోయిన మహిళ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

also read:గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్‌రేప్ కేసులో మరో ట్విస్ట్: మత్తుమందు ఆనవాళ్లు లేవని తేల్చిన మెడికల్ రిపోర్టు

తప్పిపోయిన మహిళ ఫోటో ఆధారంగా పోలీసులు గాంధీ ఆసుపత్రిలో గాలిస్తున్నారు. ఇదే ఆసుపత్రి ఆవరణలో కన్పించకుండాపోయిన మహిళ సోదరి అపస్మారకస్థితిలో కన్పించిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇదే విషయమై  చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గాంధీ ఆసుపత్రిలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. ఈ ఆసుపత్రిలోని 350 గదుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ కారణంగా ఆసుపత్రిలోకి ఎవరిని అనుమతించడం లేదు.ఇదిలా ఉంటే గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్  ఘటనపై  బాధితురాలికి నిర్వహించిన పరీక్షల్లో మత్తు మందు ఆనవాళ్లు లేవని మెడికల్ రిపోర్టు తేల్చి చెప్పింది.

 


 

click me!