ఇంధనం లేక ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్.. రోడ్డుపైనే ప్రసవించిన గిరిజన మహిళ.. నిర్మల్ లో ఘటన

Published : Aug 26, 2023, 09:59 AM IST
ఇంధనం లేక ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్.. రోడ్డుపైనే ప్రసవించిన గిరిజన మహిళ.. నిర్మల్ లో ఘటన

సారాంశం

సరైన సమయానికి అంబులెన్స్ వెళ్లకపోవడంతో ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది.

అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ఓ గిరిజన మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్దలు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే అంబులెన్స్ ఆలస్యంగా రావడానికి కారణమేంటని కుటుంబ సభ్యులు డ్రైవర్ ను అడగగా.. వాహనంలో ఇంధనం లేదని బదులిచ్చాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. 

విక్రమ్ దిగిన ప్రాంతాన్ని ‘శివశక్తి’ అని పిలవాలి - ప్రధాని మోడీ.. ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ

వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసిపేటకు చెందిన గిరిజన మహిళ గంగామణి నిండు గర్భిణి. ఆమెకు గురువారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో భర్త మోహన్ 108 అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో కుటుంబ సభ్యులు గర్భిణీని తీసుకెళ్లి స్థానిక వాగును దాటించారు. అక్కడ రోడ్డుపై అంబులెన్స్ కోసం నిరీక్షించారు. 

విమానంలో పరిచయం.. గోవాకు వెళ్లాక రిసార్ట్ చూసేందుకు రావాలని పిలిచి, పర్యాటకురాలిపై అత్యాచారం..

కానీ ఎంత సమయం గడిచినా.. ఆ వాహనం రాలేదు. గంగామణికి పురిటి నొప్పులు ఎక్కువై అక్కడే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రాత్రి 9 గంటల సమయంలో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. తరువాత అందులో బాలింతను, శిశువును ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కాగా..  3 కిలోల బరువు ఉన్న ఆ మగ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడు. తల్లి కూడా క్షేమంగానే ఉందని సమాచారం.

మధ్యాహ్న భోజనం తిని ఆస్ప‌త్రిపాలైన 70 మంది విద్యార్థులు..

ఇదిలా ఉండగా.. అంబులెన్స్ ఎందుకు ఆలస్యంగా వచ్చిందని కుటుంబ సభ్యులు డ్రైవర్ ను ప్రశ్నించారు. వాహనంలో ఇంధనం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన బదులిచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్