హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌లో చిరుతపులి సంచారం.. అప్రమత్తమైన అటవీ అధికారులు

By Mahesh Rajamoni  |  First Published Aug 26, 2023, 12:02 AM IST

Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతంలో చిరుతపులి సంచారంతో అటవీ శాఖ‌ అధికారులు అప్రమత్తమై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సాగ‌ర్ హౌసింగ్ కాంప్లెక్స్ లోని నివాసి అఖిల్ మాట్లాడుతూ.. రాత్రి భోజనం చేసిన తర్వాత, తన కుమారుడు ఇంటి ముందు సైకిల్‌పై వెళుతుండగా, చిరుతపులిని గుర్తించి, తనకు ఈ విష‌యం చెప్ప‌డానికి భయపడుతూ లోపలికి ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చాడ‌ని చెప్పారు.
 


Leopard spotted in LB Nagar: హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతంలో చిరుతపులి సంచారంతో అటవీ శాఖ‌ అధికారులు అప్రమత్తమై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సాగ‌ర్ హౌసింగ్ కాంప్లెక్స్ లోని నివాసి అఖిల్ మాట్లాడుతూ.. రాత్రి భోజనం చేసిన తర్వాత, తన కుమారుడు ఇంటి ముందు సైకిల్‌పై వెళుతుండగా, చిరుతపులిని గుర్తించి, తనకు ఈ విష‌యం చెప్ప‌డానికి భయపడుతూ లోపలికి ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చాడ‌ని చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఎల్బీనగర్ లోని బీఎన్ రెడ్డినగర్ డివిజన్ లోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో బుధవారం రాత్రి చిరుత సంచరించింది. రాత్రి భోజనం అనంతరం తన కుమారుడు ఇంటి ముందు సైక్లింగ్ చేస్తుండగా పులిని చూసి భయపడి లోపలికి పరుగెత్తానని కాంప్లెక్స్ నివాసి అఖిల్ తెలిన‌ట్టు సియాస‌త్ నివేదించింది. అఖిల్ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే వీధిలో చిరుత సంచరిస్తూ కనిపించింది. వెంట‌నే భ‌యంతో లోపలికి వచ్చి తలుపులు మూసుకున్నాడ‌ని పేర్కొంది.

Latest Videos

undefined

వెంట‌నే సంబంధిత అధికారుల‌కు చిరుత సంచారం గురించి స‌మాచారం అందించారు. అటవీ, పోలీసు అధికారులు రాత్రి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించినా చిరుత జాడ కనిపించలేదు. అప్ప‌టికే అక్క‌డి నుంచి చిరుత వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన‌ట్టుగా అనుమానిస్తున్నారు. చిరుత సంచారంతో స్థానికంగా భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అటవీ శాఖ వెంటనే చిరుతను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారుల బృందం మరోసారి ఆ ప్రాంతాన్ని సందర్శించనుందని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

స్థానికంగా ఉన్న సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ కు చెందిన నివాసి ప్రహరీ గోడపై చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం గుర్రంగూడలోని సంజీవని వనం ఫారెస్ట్ పార్కు వెనుక ఉన్న ఏవియేషన్ అకాడమీ వైపు వెళ్లింది. స్థానికులు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ కోసం ఒక రోజు వెతికినా ఫలితం లేకుండా పోయిందని సంబంధిత అధికారులు తెలిపారు. 'ఆ చిరుతను ఒక్కరు తప్ప మరెవరూ చూడలేదు. అయితే ఆ స్థలంలో రెండు బోనులను ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం' అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు.

ఏవియేషన్ అకాడమీ ప్రవేశ ద్వారం, నిష్క్రమణ వద్ద బోనులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఎల్బీ నగర్ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ నివాసమున్నదనీ, ఆటోనగర్ లోని డంప్ యార్డులో కుక్కలను వేటాడిందని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. చివరకు దాన్ని పట్టుకుని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో విడిచిపెట్టినట్టు పేర్కొన్నారు. ఎల్బీ న‌గ‌ర్ లోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, గుర్రంగూడలోని అర్బన్ పార్కులుగా మార్చబడిన రెండు అటవీ బ్లాకులు, దట్టమైన వృక్షసంపదతో ప్రసార భారతి టవర్స్ ప్రాంగణాలు ఉన్నాయి.

click me!