యాదాద్రి సెక్స్ రాకెట్: మళ్లీ మొదలైన పోలీసుల వేట...నలుగురు చిన్నారులకు విముక్తి

By Arun Kumar PFirst Published Sep 5, 2018, 8:44 PM IST
Highlights

యాదగిరి గుట్టలోని వ్యభిచార గృహాలపై మరోసారి పోలీసుల దాడులు చేశారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఇవాళ చేపట్టిన దాడుల్లో నలుగురు చిన్నారులను వ్యభిచార గృహాల నుండి కాపాడారు.  దీంతో మరోసారి గుట్టలో అలజడి మొదలైంది. యాదగిరి గుట్టలో వ్యభిచారం ఇక అంతరించినట్లే అని అందరూ అనుకుంటున్న సమయంలో తాజా దాడుల్లో చిన్నారులు దొరకడం సంచలనంగా మారింది.
 
పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో ఈ వ్యభిచార వృత్తి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే  కొద్ది రోజుల క్రితం రాచకొండ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భయంకరమైన నిజాలు బైటపడ్డాయి. వివిధ ప్రాంతాల నుండి చిన్నారులను కిడ్నాప్ చేసి తీసుకువచ్చి యాదగిరి గుట్టలోని వ్యభిచార గృహాల్లో దాచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాదు చిన్నారులకు ఎదుగుదల హార్మోన్లు ఇచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఈ పడుపు వృత్తిని నిర్శహిస్తున్న నిర్వహకులను అరెస్ట్ చేసి చిన్నారులకు విముక్తి కల్పించారు.

అయితే పోలీసుల దాడులతో భయపడిపోయిన వ్యభిచార గృహ నిర్వహకులు ఇక తాము వ్యభిచారం చేయమని ప్రకటించారు. అంతే కాకుండా తమ కాలనీల్లో దొమ్మర కుల సంఘం పేరుతో వ్యభిచారాన్ని మానివేస్తున్నట్లు పోస్టర్లు, కటౌట్లు కూడా వెలిశాయి. దీంతో ప్రజలందరు ఇక యాదగిరి గుట్టలో ఈ పాపపు పనులు ఉండవని భావించారు. కానీ మరోసారి ఇలా వ్యబిచార గృహాల్లో చిన్నారులు దొరకడం కలకలం రేపుతోంది. 

బుధవారం వ్యభిచార గృహాలపై దాడులు జరిపిన పోలీసులు నలుగురు బాలికలు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు కంసాని ఆండాలును అరెస్ట్ చేశారు.  నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. చిన్నారులకు శిశు గృహాలకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!