తెలంగాణ వచ్చినా కొత్త ఉద్యోగాలు రాలేదు: టీఆర్ఎస్‌పై ఈటల జమున ఫైర్

By narsimha lode  |  First Published Jun 18, 2021, 4:00 PM IST

తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకొన్నాం, కానీ కొత్త ఉద్యోగాలు లేవన్నారు. కానీ గొంతెత్తి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున చెప్పారు. 


హుజూరాబాద్:  తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకొన్నాం, కానీ కొత్త ఉద్యోగాలు లేవన్నారు. కానీ గొంతెత్తి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ భార్య ఈటల జమున రెండో రోజు పర్యటిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం  నేరేళ్ల గ్రామంలో ఆమె పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈటల రాజేందర్ కు అండగా ఉండాలని ఆమె కోరారు. 

also read:నాకే సీటిస్తానని హామీ: హుజూరాబాద్ బైపోల్స్‌పై పెద్దిరెడ్డి సంచలనం

Latest Videos

undefined

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు .నేరెళ్ల గ్రామ ప్రజల ఆత్మీయతకు రుణపడి ఉంటామని చెప్పారు.ఈటెలరాజేందర్ ను ఏ పార్టీలో ఉన్న గెలిపిస్తామని చెబుతున్నారన్నారు. మంత్రి పదవి నుండి రాజేందర్ ను  తీసివేసినా తమ గుండెల్లో రాజేందర్ ఉన్నాడని  గ్రామస్తులు చెప్పారన్నారు.  యువతను చూసి గర్వపడుతున్నానన్నారు. సెక్రటేరియట్ కట్టడానికి పైసలు ఉంటున్నాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టించడానికి డబ్బులు లేవా ? అని ఆమె ప్రశ్నించారు.పేద తల్లులు కనిపించడం లేదా ? ఇలాంటి ప్రభుత్వాలు మనకు వద్దు. ప్రజలకోసం పని చేసే ప్రభుత్వాలు కావాలన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదు కానీ హుజురాబాద్ ఎన్నికలు రాగానే ఇక్కడ అవన్నీ రెండు వారాల్లో ఇస్తాం అంటున్నారని ఆమె గుర్తు చేశారు.

also read:ఎన్టీఆర్, కేసీఆర్ రాజకీయాలు: ఈటల రాజేందర్ ఎగ్జిట్ వెనక

ఏది కావాలంటే అది ఇస్తాము అంటున్నారు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ పథకాలు అమలుచేసే ప్రభుత్వమని ఆమె విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం ఇవన్నీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.  ఓటుకు పదివేలు కూడ ఇచ్చేందుకు సిద్దమని అధికారపార్టీ నేతలు చెబుతున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో యువతకు, పేదలకు  అనేక హామీలు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోయారని ఆమె విమర్శించారు.  నమ్మకానికి మారు పేరైన ఈటెల రాజేందర్ కి  ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

click me!