కేసీఆర్ మీద షర్మిల ఫైర్.. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..’ అంటూ విమర్శలు..

Published : Jun 18, 2021, 03:45 PM IST
కేసీఆర్ మీద షర్మిల ఫైర్.. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..’ అంటూ విమర్శలు..

సారాంశం

తెలంగాణలో సొంత పార్టీతో అస్తిత్వాన్ని చాటుకుంటున్న షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యంగ్రాస్త్రాలు వదలడంలో ముందుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశారు. 

తెలంగాణలో సొంత పార్టీతో అస్తిత్వాన్ని చాటుకుంటున్న షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యంగ్రాస్త్రాలు వదలడంలో ముందుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశారు. 

సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో ఆమె ఇలా ట్వీట్లతో వార్ కు తెరలేపుతున్నారు. మహిళా సర్పంచ్ కు కనీస గౌరవం ఇవ్వని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ ట్వీట్ చేశారు. కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. 

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న రీతిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీరు ఉందన్నారు. కేసీఆర్ సారుకే మహిళలంటే గౌరవం లేదని, ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వడానికే 6 ఏళ్లు పట్టిందన్నారు. అలాంటిది ఇక ఎమ్మెల్యేలు మహిళలకు గౌరవమిస్తారా? అని ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather