వ్యభిచార ముఠాకు మహిళల నగ్న ఫొటోలు.. పాతబస్తీ నకిలీ బాబా కేసులో కొత్త కోణం..!

By Sumanth KanukulaFirst Published Dec 5, 2022, 10:47 AM IST
Highlights

ఆధ్యాత్మిక శక్తుల ద్వారా భారీగా డబ్బు ఏర్పాటు చేస్తానంటూ పలువురు మహిళలను మభ్యపెట్టి వారి నగ్న చిత్రాలు, వీడియోలను సేకరించిన నకిలీ బాబాను ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగుచూసింది.

హైదరాబాద్ పాతబస్తీలో పట్టుబడ్డ నకిలీ బాబా కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక శక్తుల ద్వారా భారీగా డబ్బు ఏర్పాటు చేస్తానంటూ పలువురు మహిళలను మభ్యపెట్టి వారి నగ్న చిత్రాలు, వీడియోలను సేకరించిన నకిలీ బాబాను ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పూజల పేరుతో మహిళల నగ్న ఫొటోలు, వీడియోలను చాటుగా తీయించిన నకిలీ బాబా.. వాటిని మహారాష్ట్రలోని వ్యభిచార ముఠాలకు పంపినట్టుగా  తెలుస్తోంది. అయితే మహిళల ఫొటోలకు ముఠాలు రేట్స్ ఫిక్స్ చేసేవారని తెలుస్తోంది. 

గులామ్‌గా గుర్తించబడిన నకిలీ బాబా.. తన ఆధ్యాత్మిక శక్తుల ద్వారా వారికి భారీగా డబ్బు సంపాదించడానికి సహాయం చేస్తానని చెప్పి మహిళలను ప్రలోభపెట్టాడు. వారి బట్టలు తొలగించడానికి మహిళలను మభ్యపెట్టాడు. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ ఉపయోగించి మహిళలను వారికి తెలియకుండా నగ్నంగా చిత్రీకరిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ దారుణం యదేచ్ఛగా జరుగుతోంది. ఇది గమనించిన ఒక సోషల్ యాక్టివిస్ట్.. ధైర్యంగా చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో ఈ ఆగడాలను అడ్డుకున్నారు.

Also Read: మహిళల శరీర భాగాలను ఫొటోలు తీసి, ధర నిర్ణయించి.. వ్యభిచారంలోకి.. పాతబస్తీలో వెలుగులోకి దారుణం..

ఆదివారం సాయంత్రం చాంద్రాయణగుట్ట పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నకిలీ బాబాను పట్టుకున్నారు. నకిలీ బాబాపై దాడి చేసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు రక్షణ మధ్య పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అతని వద్ద నుండి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అనేక న్యూడ్ వీడియోలు, మహిళల ఫోటోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నకిలీ బాబా ఎంతమంది మహిళలను ట్రాప్ చేశాడనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. 
 

click me!