తీరిన ఎర్రబెల్లి కల: నెరవేరని కడియం జోస్యం

By narsimha lodeFirst Published Feb 19, 2019, 12:44 PM IST
Highlights

: మంత్రిగా పనిచేయాలనే ఎర్రబెల్లి దయాకర్ రావు కల ఎట్టకేలకు నెరవేరింది. సుధీర్ఘకాలంపాటు టీడీపీలో కొనసాగినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. 

హైదరాబాద్: మంత్రిగా పనిచేయాలనే ఎర్రబెల్లి దయాకర్ రావు కల ఎట్టకేలకు నెరవేరింది. సుధీర్ఘకాలంపాటు టీడీపీలో కొనసాగినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన కేబినెట్ లో దయాకర్ రావు చోటు కల్పించారు. జీవితంలో దయాకర్ రావు మంత్రి కాలేడని గతంలో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ దయాకర్ రావుకు చోటు కల్పించారు.

సుధీర్ఘకాలం పాటు దయాకర్ రావు రాజకీయాల్లో ఉన్నారు. ఆరు దఫాలు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. పాలకుర్తి, వర్ధన్నపేట నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరంగల్ నుండి ఎంపీగా విజయం సాధించారు.

ఈ దఫా మాత్రమే ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. గతంలో అన్ని దఫాలు కూడ దయాకర్ రావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.ఎన్టీఆర్ కేబినెట్‌లో దయాకర్ రావుకు చోటు దక్కాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో లక్ష్మీపార్వతి తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకొన్నారని ఆయన ప్రకటించారు.

ఆ తర్వాత చంద్రబాబునాయుడు కేబినెట్ లో చోటు కల్పిస్తానని ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహారికి, ప్రణయ్ భాస్కర్ కు, చందూలాల్ కు చోటు దక్కింది.

రేవూరి ప్రకాష్ రెడ్డికి కూడ కేబినెట్లో చోటు కల్పించాలని గతంలో బాబు భావిస్తే దయాకర్ రావే అడ్డుకొన్నారని అప్పట్లో ప్రచారంలో జరిగింది.టీడీపీ హయాంలో దయాకర్ రావుకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. గత టర్మ్ లో దయాకర్ రావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు.

గత టర్మ్ లో  కేసీఆర్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ కు వ్యతిరేకంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న దయాకర్ రావు టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు.గత టర్మ్ లో కేసీఆర్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి దయాకర్ రావు పై తీవ్ర విమర్శలు చేశారు. 

దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరే ప్రయత్నం చేస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నలకు కడియం ఘాటుగా సమాధానం చెప్పారు. దయాకర్ రావు జీవితంలో మంత్రి కాలేడని కడియం అప్పట్లో వ్యాఖ్యానించారు.

జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరారు.తన నియోజకవర్గంలో కడియం పర్యటనను టీడీపీలో ఉన్న సమయంలో అడ్డుకొన్న దయాకర్ రావు ఆ తర్వాత తన నియోజకవర్గంలో కడియంతో కలిసి పాల్గొన్నారు.

కడియం, ఎర్రబెల్లి ఇద్దరూ కూడ బాల్య స్నేహితులు. వీరిద్దరూ కూడ తొలుత టీడీపీలోనే ఉండేవారు. 2014 ఎన్నికలకు ముందు కడియం టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

దయాకర్ రావు ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తన కేబినెట్ లో దయాకర్ రావుకు కేసీఆర్ చోటు కల్పించారు.టీడీపీ హయాంలో మంత్రి పదవి దక్కకున్నా దయాకర్ రావు చీప్ విప్ గా పనిచేశారు.

కేసీఆర్ కేబినెట్ లో దయాకర్ రావు ఇవాళ మంత్రిగా ప్రమాణం చేయడంతో ఆయన జీవిత కల నెరవేరినట్టైందని ఆయన అనుచరులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆ సామాజిక వర్గానికి కేబినెట్లో కేసీఆర్ పెద్దపీట

నవ్వుతూ రాజ్ భవన్‌కు: కేటీఆర్ పక్కనే హరీష్

ఆ ఇద్దరికీ తొలిసారే మంత్రి పదవులు

కేసీఆర్ కేబినెట్: ఆ రెండు జిల్లాలకు విస్తరణలో దక్కని చోటు

కేసీఆర్ వ్యూహం: హరీష్‌కు కేబినెట్‌లో దక్కని అవకాశం

click me!