చార్మినార్ సందర్శించిన ఆర్థిక సంఘ ఛైర్మన్

By ramya NFirst Published Feb 19, 2019, 12:35 PM IST
Highlights

15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ సింగ్...సుప్రసిద్ధ కట్టడం చార్మినార్ ని సందర్శించారు.

15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ సింగ్...సుప్రసిద్ధ కట్టడం చార్మినార్ ని సందర్శించారు. చార్మినార్ నిర్మాణం, హైదరాబాద్ చరిత్ర, చార్మినార్ పెడిస్టీరియన్ ప్రాజెక్టు, మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ లపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు. 

ఈ  సందర్భంగా ఆయన హైదరాబాద్ ఇరానీ చాయ్ ను ఆస్వాదించారు. కుతుబ్షాహి ల నిర్మాణ శైలి ని చార్మినార్ లో  చూసి మంత్రముగ్దులయ్యారు. అనంతరం ఫలక్ నుమా ప్యాలెస్ ని కూడా సందర్శించారు. ఫలకనుమాలో నందకిశోర్, ఆయన బృందానికి జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్.. తేనేటీ విందు ఇచ్చారు. అనంతరం ఆర్థిక సంఘం ఛైర్మన్ నంద కిశోర్ సింగ్ కి.. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ చార్మినార్ మొమెంటో బహుకరించారు.

ఈ పర్యటనలో ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ సింగ్ తోపాటు.. ఆయన బృందం డా. అనూప్ సింగ్, డాక్టర్.రమేష్ చంద్, జాయింట్ సెక్రటరీ ముక్ మిత్ సింగ్ భాటియా, మీడియా అడ్వైజర్ మౌసమీ చక్రవర్తి,  డైరెక్టర్లు  గోపాల్ ప్రసాద్, భరత్ భూషణ్ గార్గ్, జాయింట్ డైరెక్టర్ ఆనంద్ సింగ్ పర్మార్, డిప్యూటి డైరెక్టర్ నితీష్ షైనీ, అస్టిస్టెంట్ డైరెక్టర్ సందీప్ కుమార్, డి.డి.ఓ. డి.కె.శర్మ, PS త్యాగరాజన్ లు పాల్గొన్నారు. 

click me!