ఇష్టంలేని కోర్సులో చేర్చారని, ఇంట్లోనుంచి వెళ్లిపోయి, చెరువులో దూకి.. జీడిమెట్ల విద్యార్థి అదృశ్యం విషాదాంతం..

By AN TeluguFirst Published Nov 24, 2021, 11:17 AM IST
Highlights

ఫస్ట్ ఇయర్ లో అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తీసుకోవాలని బలవంతం చేశారు.  ఆ గ్రూపు లోనే తొలి ఏడాది చదువు పూర్తి చేశాడు. అయితే ఆ కోర్సు తనకు ఇష్టం లేదని రెండో ఏడాది కళాశాలకు వెళ్లనని చెప్పడంతో  ఎంపీసీ నుంచి సిఈసి కి బదిలీ చేయించారు.  ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం  సుమిత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

జీడిమెట్ల : నగరంలోని  జీడిమెట్ల ఇంటర్ విద్యార్థి అదృశ్యం  విషాదాంతమయ్యింది.  గాజులరామారం చింతలచెరువు లో విద్యార్థి dead body లభ్యమైంది.  ఈ నెల 22న షాపూర్ నగర్ కు చెందిన సుమిత్ కుమార్ (17) అదృశ్యమయ్యాడు.  తల్లిదండ్రులు ఇష్టంలేని  కోర్సులో చేర్పించాలని  మనస్తాపానికి గురైన సుమిత్  ఇంటి నుంచి వెళ్లిపోయాడు.  నిన్న  చింతల్ చెరువు వద్ద ఉన్న విద్యార్థి చెప్పులు ఆధారంగా  గాలింపు చేపట్టిన పోలీసులు ఇవ్వాళ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు.

అసలేం జరిగిందంటే..
షాపూర్ నగర్ లో నివాసం ఉంటున్న రమేష్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగి.  అతని కుమారుడు ఓ private collegeలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.  ఫస్ట్ ఇయర్ లో అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తీసుకోవాలని బలవంతం చేశారు.  ఆ గ్రూపు లోనే తొలి ఏడాది చదువు పూర్తి చేశాడు. అయితే ఆ కోర్సు తనకు ఇష్టం లేదని రెండో ఏడాది కళాశాలకు వెళ్లనని చెప్పడంతో  ఎంపీసీ నుంచి సిఈసి కి బదిలీ చేయించారు.  ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం  సుమిత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి బంధువులు స్నేహితుల వద్ద  ఫలితం కనిపించలేదు.  ఇ అదే రోజు సాయంత్రం విద్యార్థి తల్లిదండ్రులు policeకు ఫిర్యాదు చేశారు. missing case నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.  షాపూర్ నగర్ నుంచి గాజులరామారం..  అక్కడి నుంచి గాజులరామారం వైపు వెళ్తున్నట్లు cc tv footage దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలోనే నిన్న  చెరువు వద్ద  నిన్న విద్యార్థి  చెప్పులు  దొరికాయి.

ఆశారాం బాపూ ఆశ్రమం నుంచి మరో యువకుడు అదృశ్యం...!!

దీంతో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్  బృందాలను రంగంలోకి దించారు.  మంగళవారం మధ్యాహ్నం నుంచి చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. మళ్లీ ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టి విద్యార్థి మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. 

ఇదిలా ఉండగా, గత సెప్టెంబర్ లో అమీర్ పేటలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అమీర్ పేటలో Governament Schoolకు వచ్చిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు సమాచారం మేరకు. యూసుఫ్ గూడ స్టేట్ హోంలోని బాలసదనంలోని ప్రియ అనే బాలిక వెంటళరావునగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. 

CM KCR: కేసీఆర్ ఎందుకు ఇంతలా జాగ్రత్త పడుతున్నారు.. ఆయన వైఖరిలో మార్పులకు కారణమేమిటి..?

బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న lunch break సమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్ఎం ధనుంజయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!