ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు ఈ-చలానాలతో హడలెత్తిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రభుత్వ వాహనాలు సైతం ఉంటున్నాయి.
కామారెడ్డి కలెక్టర్ వాహనం (టీఎస్16 ఈఈ3366) మీద భారీ మొత్తం ఈ-చలానాలు ఉణ్నాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 చలానాలు వేశారు. మొత్తం రూ. 27,580 జరిమానా పడింది. ఇందులో 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం.
ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన అధికారులే నిబంధనలు పాటించకపోతే.. ఇక సామాన్య ప్రజలు ఎందుకు పాటిస్తారు. వాహనాల మీద ట్రాఫిక్ సిబ్బంది వేసే చలానాల విషయంలో తరచుగా ఇది కనబడుతూ ఉంది. దేశాన్ని పాలించే నాయకుల నుంచి సామాన్యుల వరకు Traffic regulations తప్పకుండా పాలించాలంటూ పోలీసులు తరచూ చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. దీనికి సంబంధించిన నిదర్శనాలు అప్పుడప్పుడూ దర్శనమిస్తూనే ఉన్నాయి. అలా ఓ District Collector ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. ఆయన వాహనం మీద ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. వివరాల్లోకి వెడితే..
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు ఈ-చలానాలతో హడలెత్తిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రభుత్వ వాహనాలు సైతం ఉంటున్నాయి.
Kamareddy District Collector వాహనం (టీఎస్16 ఈఈ3366) మీద భారీ మొత్తం ఈ-చలానాలు ఉణ్నాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 చలానాలు వేశారు. మొత్తం రూ. 27,580 జరిమానా పడింది. ఇందులో 24 over speedగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం.
undefined
అయితే, కలెక్టర్లు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. కామారెడ్డి కలెక్టర్ మొదటి వ్యక్తి కాదు. అంతకు ముందు జనగామ జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాంటి కేసే ఉంది. గత సెప్టెంబర్ లో ఇది బయటపడింది. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి రెండేళ్లలో (2021, ఆగస్టు 30వ తేదీ వరకు) ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్ కాగా, ఒకసారి Traffic signals వద్ద జీబ్రా క్రాసింగ్ చేసినందుకు చలానాలు విధించారు.
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఈటల ఎఫెక్ట్... టీఆర్ఎస్ అలర్ట్, క్యాంప్ రాజకీయాలు షురూ
ఈ చలానాల మొత్తం రూ.22,100 కాగా, యూర్ ఛార్జీలు రూ.805 కలపుకుని మొత్తం 22,905 రూపాయలు ఉంది. ఈ చలానాల్లో సగానికి పైగా హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్ తో వెళ్లినందుకే విధించడం గమనార్హం. అయితే అప్పట్లో దీనిమీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.
వాహనం మీద ఒక్క చలానా పెండింగ్ ఉన్నా వాహనాన్ని సీజ్ చేస్తామంటూ ప్రకటించిన పోలీసులు ఇలా పదుల సంఖ్యలో Challans pending లో ఉన్న కలెక్టర్ మీద ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ పోలీసులు కలెక్టర్ వాహనం మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అధికారుల వాహనాలపై కూడా తగు చర్యలు, నియమ నింబంధనలు పాటించడంలో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.