కాంగ్రెసులో చేరుతున్నారనే వార్తలపై డిఎస్ స్పందన

By pratap reddyFirst Published Sep 5, 2018, 8:07 PM IST
Highlights

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసంతృప్త నేత, రాజ్యసభ సభ్యుడు డిఎస్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసంతృప్త నేత, రాజ్యసభ సభ్యుడు డిఎస్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

తనకు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి సమాధానం రావాల్సిందేనని అన్నారు. టీఆర్ఎస్ నేతల విమర్శలపై తాను మాట్లాడదలుచుకోలేదని చెప్పారు.  తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని అన్నారు. టీఆర్‌ఎస్ నేత బాజిరెడ్డి గోవర్దన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి సందేశం రాలేదని డీఎస్ చెప్పారు. 

ఈనెల 11న సోనియా, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా కాంగ్రెసులో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను డిఎస్ కొట్టిపారేశారు.
 
డీఎస్‌పై బాజిరెడ్డి గోవర్దన్‌ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డీఎస్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో డీఎస్‌కు సముచితస్థానం ఇస్తే విశ్వాసంగా ఉండకుండా.. పదవుల కోసం కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరిపారని ఆయన అన్నారు.

ఈ వార్తాకథనాలు చదవండి

కాంగ్రెస్ గూటికి డీఎస్.. పచ్చజెండా ఊపిన అధిష్టానం

దయచేసి సస్పెండ్ చేయండి, లేదంటే.. : డీఎస్

సంజయ్‌పై అత్యుత్సాహం, అరవింద్ ముందే చెప్పాడు: డీఎస్

కేసీఆర్ కేబినెట్ లో అసంతృప్తులు: డీఎస్ సంచలనం

గతంలోనూ సంజయ్ అరాచకాలకు పాల్పడ్డాడు... కానీ ఎందుకు బైటపడలేదంటే...

click me!