యాదాద్రి శిల్పాల వివాదం కొలిక్కి: దిగొచ్చిన అధికారులు, బొమ్మలు తొలగింపు

By Nagaraju penumalaFirst Published Sep 7, 2019, 9:28 PM IST
Highlights

వివాదానికి కారణమైన కేసీఆర్ బొమ్మతోపాటు రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతీ బొమ్మలను తొలగించనున్నట్లు వైటీడీఏ వైయస్ చైర్మన్ కిషన్ రావు స్పష్టం చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ బొమ్మల తొలగింపు చర్యలను అధికారులు చేపట్టారు. 
 

యాదాద్రి: ప్రవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో నెలకొన్న శిల్పాల వివాదంపై వైటీడీఏ అధికారులు వెనక్కి తగ్గారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న అష్టభుజి బాహ్య ప్రాకార మండపం స్తంభాలపై చెక్కిన బొమ్మలను తొలగించాలని నిర్ణయించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌, హరితహారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, కారుగుర్తులను తొలగించేందుకు యాదాద్రి టెంపుల్ డవలప్ మెంట్ అథారిటీ అధికారులు నిర్ణయానికి వచ్చారు. 

వివాదానికి కారణమైన కేసీఆర్ బొమ్మతోపాటు రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతీ బొమ్మలను తొలగించనున్నట్లు వైటీడీఏ వైయస్ చైర్మన్ కిషన్ రావు స్పష్టం చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ బొమ్మల తొలగింపు చర్యలను అధికారులు చేపట్టారు. 

ఇకపోతే దేవాలయంలోని స్తూపాలపై కేసీఆర్, కారు గుర్తులు చెక్కించడాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు ప్రజా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం బీజేపీ నిరసన కార్యక్రమం సైతం చేపట్టింది. యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు బీజేపీ చీఫ్ డా.లక్ష్మణ్ తోపాటు పలువురు బీజేపీ నేతలు ప్రయత్నించారు. 

ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు యాదాద్రి టెంపుల్ లో రాజకీయ చిహ్నాలపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సైతం కమిటీ వేసింది. త్వరలోనే ఈ కమిటీ యాదాద్రి టెంపుల్ ను సందర్శించనుంది. 

వైటీడీఏలో రాజకీయ చిహ్నాలపై రాజకీయ దుమారం రేపడంతో అధికారులు వెనక్కి తగ్గారు. తక్షణమే చిత్రాలను తొలగించే పనిలో పడ్డారు. పోలీసు బందోబస్తు నడుమ రాజకీయ చిహ్నాలను తొలగించేందుకు రంగంలోకి దిగారు ఆలయ అధికారులు. 

ఈ వార్తలు కూడా చదవండి

యాదాద్రి శిల్పాల వివాదంపై కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి ఆగ్రహం: తక్షణమే తొలగించాలని ఆదేశం

యాదాద్రి టెంపుల్ వద్ద ఉద్రిక్తత: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను అడ్డుకున్న పోలీసులు, లాఠీఛార్జ్

యాదాద్రి వివాదం: కేసీఆర్ కృష్ణదేవరాయలా, మోనార్కా?

కేసీఆర్ చిత్రాలు: యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్, ప్రభుత్వానికి అల్టిమేటమ్

యాదాద్రిపై కేసీఆర్ సారు శిల్పాలు (ఫొటోలు)

ఆయనకు దేవుడు, యాదాద్రిపై అందుకే కేసీఆర్ బొమ్మ చెక్కాడు: కిషన్ రావు

యాదాద్రి శిల్పాలపై అధికారుల వివరణ: భావి తరాల కోసమే కేసీఆర్, కారు చిత్రాలు, రాజకీయ ఉద్దేశం లేదు

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు

click me!