నయా స్టైల్లో సైబర్ మోసాలు... వాట్సాఫ్ ద్వారా హైదరాబాదీని దోచేసిన కేటుగాళ్లు

By Arun Kumar PFirst Published Sep 22, 2021, 9:50 AM IST
Highlights

బ్యాంక్ సిబ్బంది పేరిట ఫోన్ చేసి అకౌంట్ వివరాలు సేకరించి దోచేసేవారు సైబర్ నేరగాళ్లు.ఇలాంటి మోసాల గురించి ప్రతిఒక్కరికీ తెలిసిపోవడంతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు చీటర్స్.

 హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు(Cyber Crime) సరికొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మొదట బ్యాంక్ సిబ్బంది పేరిట ఫోన్ చేసి అకౌంట్ వివరాలు సేకరించి దోచేసేవారు.ఇలాంటి మోసాల గురించి ప్రతిఒక్కరికీ తెలిసిపోవడంతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు సైబర్ చీటర్స్. తాజాగా సోషల్ మీడియా మాధ్యమం వాట్సాప్ లో గ్రూప్ ను ఏర్పాటుచేసి మరీ ఓ హైదరాబాదీ నుండి ఏకంగా రూ.14లక్షలు దోచేసారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన షేక్ నసీబుద్దిన్ ఫోన్ నెంబర్ సంపాదించారు సైబర్ నేరగాళ్ళు. ఈ నెంబర్ ను బిట్ కాయిన్ - ఎం8 పేరుతో వున్న వాట్సాఫ్ గ్రూప్ లో యాడ్ చేశారు. బిట్ కాయిన్ వ్యాపారంలో శిక్షణ ఇస్తామని... దీని ద్వారా కోట్లల్లో సంపాదించవచ్చని అతడిని నమ్మించారు. ట్రైనింగ్ ఇస్తున్నట్లు మభ్యపెట్టి విడతల వారిగా నసీబుద్దిన్ నుండి రూ.14లక్షల వరకు కాజేశారు చీటర్స్.  

read more  హైదరాబాద్: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నే బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు, ఆరులక్షలు హాంఫట్

అందినకాడికి నసీబుద్దిన్ నుండి దోచేసిన కేటుగాళ్లు అతడికి అనుమానం రాగానే వాట్సాప్ గ్రూప్ నుండి డిలేట్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన నసీబ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

ఇదిలావుంటే హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన ఓ మహిళా వ్యాపారి రేఖను నుండి సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఆమె అమెరికన్ ఎక్స్  ప్రెస్ రెండు క్రెడిట్  కార్డుల వివరాలను సేకరించి ఆమెకు తెలియకుండానే రూ.5.70 లక్షలు కాజేసారు. తన ప్రమేయం లేకుండానే క్రెడిట్ కార్డు నుండి డబ్బులు మాయం కావడంతో సదరు మహిళ సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేసింది. క్లోనింగ్ ద్వారా కేటుగాళ్లు నకిలీ కార్డులు సృష్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

click me!