చార్జీషీట్ కు నాలుగేళ్ల తర్వాత ఆమోదం: మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు

By narsimha lodeFirst Published Jul 1, 2021, 4:03 PM IST
Highlights

నాలుగేళ్ల తర్వాత సిట్ దాఖలు చేసిన చార్జీషీట్ కు కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో మరోసారి డ్రగ్స్  కేసు తెరమీదికి వచ్చింది.

హైదరాబాద్: నాలుగేళ్ల తర్వాత సిట్ దాఖలు చేసిన చార్జీషీట్ కు కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో మరోసారి డ్రగ్స్  కేసు తెరమీదికి వచ్చింది.2017 జూలై 2న  12 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఆ సమయంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ గా ఉన్న అకున్ సభర్వాల్ ఈ కేసును పర్యవేక్షించారు.ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జీషీట్ కు నాలుగేళ్ల తర్వాత కోర్టు ఆమోదం తెలిపింది.

ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన 12 డ్రగ్స్ కేసుల్లో 8  కేసులకు సంబంధించి చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ కేసుల్లో ఇప్పటికే 30 మందిని అరెస్ట్ చేశారు. మరో 27 మందిని విచారించారు.60 మంది అధికారులు విచారణ చేశారని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్ లో అధికారులు తెలిపారు.11 మంది ప్రముఖులతో పాటు హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా ఎక్సైజ్ అధికారులు విచారించారు.ఈ డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు  ఎక్సైజ్ అధికారులు  క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ కేసు విషయమై సెంటర్ పర్ గుడ్ గవర్నెర్స్ ప్రతినిధులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


 

click me!