సోషల్ మీడియాలో ఇద్దరు బాలికలతో పరిచయం.. మార్ఫింగ్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం..

By Asianet News  |  First Published Nov 12, 2023, 12:29 PM IST

సోషల్ మీడియాలో పరిచయం అయిన ఇద్దరు బాలికపై ఇద్దరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. స్నేహం పేరుతో వీడియో ఛాటింగ్ చేసి వాటిని అసభ్యకరంగా మార్పింగ్ చేశారు. అనంతరం వాటి ఆధారంగా బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.


సోషల్ మీడియాలో ఇద్దరు బాలికలకు ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. దానిని బాలికలు యాక్సెప్ట్ చేశారు. కొంత కాలం పాటు వారి మధ్య చాటింగ్ కొనసాగింది. తరువాత వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. ఈ వీడియోలను వారిద్దరూ మార్ఫింగ్ చేసి బాలికను బ్లాక్ మెయిల్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Plane crashes into car : కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్..

Latest Videos

undefined

దీనికి సంబంధించిన వివరాలను సీపీ సందీప్ శాండిల్య బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శనివారం మీడియాతో వెల్లడించారు. సిటీలోని ఇద్దరు బాలికల సోషల్ మీడియా అకౌంట్స్ కు ఇద్దరు వ్యక్తుల నుంచి వేరు వేరుగా ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వచ్చాయని తెలిపారు. వాటిని బాలికలు యాక్సెప్ట్ చేశారని చెప్పారు. దీంతో వారి మధ్య ఫ్రెండ్ షిప్ పెరిగిందని వెల్లడించారు. 

కొంత కాలం తరువాత ఫ్రెండ్ షిప్ పేరుతో వారు వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. అయితే ఈ సమయంలో బాలికకు తెలియకుండా ఆ వ్యక్తులు ఆ వీడియో ఛాటింగ్ ను రికార్డు చేసి భద్రపర్చుకున్నారు. ఆ వీడియోలను మార్ఫింగ్ చేశారు. బాలికలు నగ్నంగా ఉన్నట్టు తయారు చేశారు. వాటిని బాలికలకు పంపించారు. ఆ వీడియోల ఆధారంగా బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. వాటిని బయటకు విడుదల చేస్తామని బెదిరించి రేప్ చేశారు. 

పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించింది: బీఆర్ఎస్‌లోకి స్రవంతికి ఆహ్వానం పలికిన కేటీఆర్

ఈ ఘటన జరిగిన అనంతరం బాధితుల్లో ఒక బాలిక మనస్థాపానికి గురయ్యింది. ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లకుండా సైలెంట్ గా ఉంటూ ఇంట్లోనే ఉండిపోయింది. దీనిని ఆమె తల్లి గమనించింది. ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో బాధిత బాలిక మొత్తం విషయం తల్లికి తెలియజేయడంతో ఇది బయటకు వచ్చింది. అలాగే మరో బాధిత బాలిక కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు. అలాగే నిందితుల నుంచి రూ.30 వేల విలువైన మత్తు మాత్రలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పిల్లలు ఎలా చదువుతున్నారు ? ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని కోరారు. పిల్లలకు తమ మనసులోని భావాలను వ్యక్త పరిచే స్వేచ్ఛను ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లలో సోషల్ మీడియా వైపు మరలుతున్నారని చెప్పారు. 

కాంగ్రెస్ సదన్ పేరును ‘ఆర్ఎస్ఎస్ అన్నా’గా మార్చండి - కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ పై మండిపడ్డ ఓవైసీ

అలాగే కొత్త వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లు కూడా అమ్మాయిలు యాక్సెప్ట్ చేయకూడదని సూచించారు. సోషల్ మీడియాలో ఎదురయ్యే సమస్యలను భరిస్తూ సంఘర్షణకు గురి కాకూడదని సూిచంచారు. ఏవైనా సమస్యలు ఉంటే 94906 16555, 87126 60001 నెంబర్లకు ఫోన్ చేసి అయినా, వాట్సప్ ద్వారా అయినా  సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటామని, బాధితుల వివరాలు చాలా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

click me!