Diwali 2023: ప్ర‌జ‌ల‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

By Mahesh Rajamoni  |  First Published Nov 12, 2023, 8:16 AM IST

Happy Diwali 2023: కోట్లాది మంది భారతీయులు నేడు దీపావ‌ళిని ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. హిందువులు జ‌రుపుకునే, దేశంలోని అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దీపావళిగా జరుపుకుంటారు. చీకటిపై కాంతి, దుఃఖంపై ఆనంద విజయాన్ని సూచించడానికి ప్రజలు తమ ఇళ్లను చిన్న నూనె దీపాలు, పేపర్ లాంతర్లతో అలంక‌రిస్తారు.
 


Diwali: దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తోందని, సమాజంలో ఐక్యత, శాంతి నెలకొనాలని గవర్నర్ పిలుపునిచ్చారు. స్వయం-విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి స్థానిక వ్యాపారాలు మరియు తయారీదారులకు మద్దతు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు.

Happy deepavali pic.twitter.com/4VOvArDmwc

— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv)

హిందూ సంస్కృతిలో దీపావళి విజయానికి ప్రతీకగా, మన జీవితాల్లో వెలుగులు నింపే విశిష్టతను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌స్తావించారు. సంకల్పం, చైతన్యంతో ముందుకు సాగేందుకు పండుగ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. బాణాసంచా కాల్చేటప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ద్వారా ప్రజలు బాధ్యతాయుతంగా దీపావ‌ళిని జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

Latest Videos

undefined

 

మనలో సరికొత్త ఉత్సాహానికి స్ఫూర్తినిస్తూ.. వెలుగును పంచే దీపావళి పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. pic.twitter.com/DQ0DLoS8ei

— BRS Party (@BRSparty)

 

 

click me!