తెలంగాణలోని 8 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఏకాభిప్రాయం కుదిరితే ఇవాళ అధికారికంగా ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ఈ నెల 19వ తేదీ పొద్దుపోయేవరకు పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో చర్చించినట్టుగా సమాచారం.ఈ అభ్యర్థుల జాబితాతో పాటు ఇంకా మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇవాళ కూడ చర్చించనుంది. ఏకాభిప్రాయం కుదిరిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
also read:రైల్వేలో నకిలీ ఎస్ఐ అవతారం:నల్గొండ జిల్లాలో యువతి అరెస్ట్
undefined
తెలంగాణ రాష్ట్రం నుండి సీఎం అనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కూడ టిక్కెట్లు కేటాయించే అవకాశం లేకపోలేదు.
also read:ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ: గిన్నిస్ రికార్డు స్వంతం చేసుకున్న బెంగుళూరు సంస్థ
వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టిక్కెట్టు ఇవ్వాలని తొలుత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అయితే బీఆర్ఎస్ కు చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దరిమిలా రంజిత్ రెడ్డిని చేవేళ్ల బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది. పట్నం సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి దానం నాగేందర్ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది.
also read:ఏనుగును బంధించేందుకు ఫారెస్ట్ అధికారుల యత్నం: రోడ్డుపై పరుగులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి మల్లు రవి, సంపత్ కుమార్ మధ్య పోటీ నెలకొంది. ఆదిలాబాద్ నుండి సుమలత, సుగుణ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తుంది. పెద్దపల్లి నుండి గడ్డం వంశీ, నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుండి ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఇటీవలనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ నుండి దయాకర్ ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపే అవకాశం ఉంది.ఈ పేర్లపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించారు. అయితే వీటిలో కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఏకాభిప్రాయం కుదరలేదనే ప్రచారం కూడ సాగుతుంది. ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన స్థానాల్లో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు.