ఎందుకో చెప్పాల్సిందే: కేసీఆర్‌కు విజయశాంతి సవాల్

By narsimha lodeFirst Published Oct 4, 2018, 4:23 PM IST
Highlights

 ఓసేయ్.... రాములమ్మా సినిమాలో తాను ఎన్ని కష్టాలు పడ్డానో... కేసీఆర్ నాలుగున్నర ఏళ్ల పాలనలో కూడ ప్రజలు అలాగే కష్టాలు పడుతున్నారని  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు

ఆలంపూర్: ఓసేయ్.... రాములమ్మా సినిమాలో తాను ఎన్ని కష్టాలు పడ్డానో... కేసీఆర్ నాలుగున్నర ఏళ్ల పాలనలో కూడ ప్రజలు అలాగే కష్టాలు పడుతున్నారని  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. తనను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని ఆమె కేసీఆర్‌కు సవాల్ విసిరారు. 

ఆలంపూర్‌లో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.  ఈ సందర్భంగా ఆలంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో విజయశాంతి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపర్చేలా ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ న్యాయం చేస్తాడని తాను కూడ నమ్మినట్టు  విజయశాంతి చెప్పారు. అందుకే ఈ నాలుగున్నర ఏళ్ల పాటు కేసీఆర్ పై ఏం మాట్లాడలేదన్నారు. కానీ, తనకు కేసీఆర్ పై నమ్మకం పోయిందన్నారు. ఎన్నికలకు ముందే  తనను టీఆర్ఎస్ నుండి ఎందుకు  సస్పెండ్ చేశారో చెప్పాలని ఆమె కోరారు.  రాత్రికి రాత్రే సమావేశం పెట్టి తనను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణ కోసం త్యాగం చేసిన రామ్ములను ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేశావో చెప్పాలని ఆమె కేసీఆర్ ను ప్రశ్నించారు. తనను మోసం చేసినా పట్టించుకోలేదన్నారు. మరోవైపు  తెలంగాణ ప్రజలను మోసం చేస్తే మాత్రం తాను  మాత్రం తట్టుకోలేకపోయానని ఆమె చెప్పారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి మాత్రమే  న్యాయం జరిగిందని ఆమె విమర్శించారు.

టీఆర్ఎస్ చెబుతున్న సంక్షేమ పథకాలు టీఆర్ఎస్‌ నేతలకు సంపాదనను సృష్టించిపెట్టాయన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏపీ నేతలు ఏ రకంగా పాలన చేశారో... కేసీఆర్ పాలన కూడ అలానే సాగుతోందని ఆమె విమర్శించారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా..... డబుల్ బెడ్‌రూమ్  ఇల్లు ఆశ చూపించిన కేసీఆర్‌కు ఓట్లేసి మోసపోయారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ సారి కూడ మోసపు వాగ్ధానాలను చెప్పి ప్రజలను  మభ్యపెట్టేందుకు కేసీఆర్ వస్తున్నాడని చెప్పారు.ఈ సారి కూడ  ఈ మోసపు మాటలను నమ్మితే మరోసారి నష్టపోవడం ఖాయమన్నారు.

దొరలపాలనను చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆమె కోరారు. ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. తాను అండగా నిలబడి ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని ఆమె తెలిపారు. ఓటేసిన ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనే తీరిక కేసీఆర్ కు లేదన్నారు.

విచ్చలవిడిగా డబ్బులు, మద్యం సరఫరా చేసి ఓట్లు పొందాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆమె ఆరోపించారు.  అయితే డబ్బులిస్తే తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజయశాంతి కోరారు.  మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకోకూడదని  ఆమె కోరుకొన్నారు. తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని ఆమె కోరారు.

సంబంధిత వార్తలు

కత్తి దూసిన జానా: రాములమ్మ, జేజమ్మల విన్యాసాలు

వైఎస్ సెంటిమెంట్‌కు తిలోదకాలు: నైరుతిని నమ్ముకొన్న కాంగ్రెస్

ఆలంపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం

శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం

ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ

6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

click me!