కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

By Arun Kumar PFirst Published Sep 27, 2018, 4:25 PM IST
Highlights

తెలంగాణలో అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దమైంది. మరో రెండు నెలల్లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమయంలో తెలంగాణలోని ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం ముదిరింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులపై పోలీస్ కేసులు నమోదవగా... పాత కేసుల విచారణ కూడా వేగం పుంజుకుంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుండి కాంగ్రెస్ నాయకుడు, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు మొదలయ్యాయి. ఐటీ అధికారులు రేవంత్ తో పాటు అతడి బంధువుల ఇళ్లపై కూడా దాడి చేసి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

అయితే ఈ ఐటీ దాడులపై రేవంత్ స్పందించారు. కోడంగల్ ప్రచారం ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరుతూ కార్యకర్తలతో కాస్త బావోద్వేగంగా మాట్లాడారు. అన్ని బావుంటే మళ్లీ కొడంగల్ కు వస్తానంటూ ఉద్వేగంగా మాట్లాడారు. లేకపోతే జైలు నుంచే నామినేషన్ వేస్తానని అన్నారు. కొడంగల్ ప్రజలపై నమ్మకంతోనే ఇపుడు హైదరాబాద్ వెళుతున్నట్లు రేవంత్ కార్యకర్తలతో తెలిపారు. ఢిల్లీలోని మోడీ, రాష్ట్రంలోని కేడి(కేసీఆర్) జోడి అయి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తాను భయపడేది లేదని రేవంత్ స్పష్టం చేశారు.

 ఇవాళ ఉదయం నుంచి కొడంగల్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారులు రేవంత్ రెడ్డి ఇంటినుండి ఎలాంటి డాక్యుమెంట్లుగాని, డబ్బులు కానీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం లేదు. అయితే మధ్యాహ్నం నాలుగు గంటలకు ఐటీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఈ దాడులకు సంబంధించిన విషయాలను వెల్లడించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

అయితే ఈ ఐటీ దాడులను ఏమాత్రం పట్టించుకోకుండా రేవంత్ ఇవాళ వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం మదన్ పల్లిలో ఉదయం ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం బురాన్ పూర్, బొంరాస్ పేట మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కొస్గి మండలం పోలేపల్లికి రేవంత్ ప్రచారం చేశారు. అక్కడినుండి హైదరాబాద్ కు బయలుదేరుతూ పైవిధంగా భావోద్వేగానికి లోనయ్యారు రేవంత్. 

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

click me!