ఎంపి కవితతో భేటీ అయిన అర్జున అవార్డు గ్రహీత

By Arun Kumar PFirst Published Sep 27, 2018, 3:04 PM IST
Highlights

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిని నేలకుర్తి సిక్కి రెడ్డికి ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అందించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం డిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిక్కిరెడ్డి అర్జున అవార్డును స్వీకరించింది. అయితే అవార్డుతో హైదరాబాద్ కు చేరుకున్న ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి కవితను కలుసుకున్నారు.

సిక్కిరెడ్డి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని కల్వకుంట కవిత ఇంటికి చేరుకుని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అర్జున అవార్డు సాధించిన సిక్కిరెడ్డిని ఎంపి  అభినందించారు. ఇలాగే సిక్కిరెడ్డి ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మరిన్ని అవార్డులు కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు కవిత తెలిపారు. 

సిక్కిరెడ్డి అంతర్జాతీయ క్రీడా వేదికల్లో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణిగా తెలంగాణ కీర్తిపతాకాన్ని ఎగురవేశారని కవిత ప్రశంసించారు. మోకాలి గాయంతో ఒక దశలో రాకెట్ పట్ట లేని పరిస్థితిని ఆత్మవిశ్వాసంతో అధిగమించి, ప్రాక్టీస్ ను కొనసాగించిన సిక్కి రెడ్డి క్రీడాకారులందరికీ స్ఫూర్తి గా నిలిచారని ఎంపీ కవిత అన్నారు. ఈ సందర్భంగా సిక్కిరెడ్డికి బతుకమ్మ జ్ఞాపికను ఎంపి కవిత అందజేశారు.  

click me!