అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

By Arun Kumar PFirst Published Aug 29, 2018, 1:41 PM IST
Highlights

ఇవాళ తెల్లవారుజామున నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మఈతిచెందారు. ఈయన మృతికి  తెలంగాణ సీఎం సంతాపం తెలిపారు. అంతేకాకుండా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లను చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా హరికృష్ణతో  తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలుగు దేశంలో పనిచేసిన కాలంలో హరికృష్ణతో తనకు మంచి సత్సంబంధాలు ఉండేవని గుర్తుచేసుకున్నారు. ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తననెంతో బాధించిందని సీఎం తెలిపారు. ఆయన కుటుంబానికి, తనయులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు సానుభూతి ప్రకటించారు. 

 రంగారెడ్డి మొయినాబాద్ లో గల ఫాంహౌస్ లో గురువారం హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యలతో మాట్లాడి అధికారికంగా అంత్యక్రియలను నిర్వహించాలని సీఎం ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు.    

నందమూరి హరికృష్ణ మృతిపై తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం రాజకీయ, సినీ రంగానికి తీరని లోటని అన్నారు. హరికృష్ణ కుటుంబానికి కేటీఆర్ సానుభూతి ప్రకటించారు.

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

హరికృష్ణకు అది సెంటిమెంట్....కానీ ఇవాళ అలా ఎందుకు వెళ్లారో మరి: హరికృష్ణ సన్నిహితుడు

తెలుగు భాషంటే ప్రాణమిచ్చే హరికృష్ణ...మాతృ భాషా దినోత్సవం రోజే ఇలా....

ఎన్టీఆర్ విలపిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది!

వర్షాలకు పాడైన రోడ్డు...అందువల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది : నల్గొండ ఎస్పీ

హైదరాబాద్ బయలుదేరిన హరికృష్ణ కుమార్తె సుహాసిని
  
click me!