అప్పుడు సంబరాలు.. ఇప్పుడు తిట్లు: లగడపాటి సర్వేపై బాబు వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Dec 5, 2018, 12:14 PM IST
Highlights

లగడపాటి రాజగోపాల్, మంత్రి కేటీఆర్ మధ్య వాట్సాప్ స్క్రీన్ షాట్ల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. 

లగడపాటి రాజగోపాల్, మంత్రి కేటీఆర్ మధ్య వాట్సాప్ స్క్రీన్ షాట్ల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన 2014 ఎన్నికల సమయంలో లగడపాటి సర్వే తర్వాత టీఆర్ఎస్ సంబరాలు చేసుకుందన్నారు.

కానీ ఇప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే సరికి లగడపాటినీ తిడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.  ప్రజాకూటమి ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. పోలింగ్ ఎక్కువ శాతం జరగాలని ప్రజాకూటమికి ఎక్కువ మెజారిటీ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

దేశంలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చానని.. కేంద్రంలోని బీజేపీని ఓడించేందుకు రాహుల్ గాంధీతో కలిశానని స్పష్టం చేశారు.  తెలంగాణ ధనిక రాష్ట్రమని.. ఇక్కడున్న వనరులు ఎక్కడా లేవన్నారు.. తెలంగాణకు వున్న ప్రధాన సమస్య కేసీఆరేనని... ఆయన ఓ నియంతని, ఎవరినీ మాట్లానివ్వరని చంద్రబాబు ఆరోపించారు.

అభివృద్ధి ఫలాలను కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తుందన్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సీఎం హోదాలో ఉండి కొండగట్టులో బస్సు ప్రమాద బాధితులను పరామర్శించలేదని.. ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారని చంద్రబాబు విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 10 లక్షల ఇళ్లు నిర్మించామని..కానీ నేటి వరకు ఒక్క ఇంటిని కూడా కట్టలేదన్నారు. ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతానని.. ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారని చంద్రబాబు ప్రశ్నించారు. హైదరాబాద్ బంగారు గుడ్లు పెట్టే బాతు.. నాలుగేళ్లలో భాగ్యనగరాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది టీడీపీయేనని ఏపీ సీఎం స్పష్టం చేశారు.
 

లగడపాటి సర్వే అంతా బోగస్.. ఎంపీ గుత్తా

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి ఈసారి సన్నాసుల్లో కలుస్తాడు.. హరీశ్ రావు

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

click me!