ఇక నుండి సెప్టెంబర్ 17న హైద్రాబాద్ విమోచన దినోత్సవం: కేంద్రం నోటిఫికేషన్

By narsimha lode  |  First Published Mar 13, 2024, 10:05 AM IST

ఇక నుండి ప్రతి ఏటా హైద్రాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.


హైదరాబాద్:ప్రతి ఏటా సెప్టెంబర్  17వ తేదీని హైద్రాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించనున్నట్టుగా  కేంద్ర ప్రభుత్వం  మంగళవారం నాడు ప్రకటించింది.1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడ హైద్రాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉంది.   ఆపరేషన్ పోలో లో భాగంగా నిజాంపై అప్పటి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. ఈ క్రమంలోనే నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైంది.  

also read:ఎంపీ ఎన్నికలకు మరో నలుగురి పేర్లు ఖరారు: జాబితాలో కొత్తముఖాలు

Latest Videos

undefined

అప్పట్లో నిజాం పాలనలో రజాకార్లకు వ్యతిరేకంగా  పోరాటం సాగింది. తెలంగాణ సాయుధ పోరాటం అప్పట్లో ప్రసిద్దికెక్కింది. ఈ పోరాటం కారణంగానే  తొలి దశ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో  కమ్యూనిస్టు పార్టీ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు.

also read:గీతాంజలి మృతిపై రాజకీయరంగు: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మాటల యుద్ధం, ఎవరి వాదన వారిదే...

నిజాం పాలన నుండి  విముక్తి కావడంతో సెప్టెంబర్ 17వ తేదీని హైద్రాబాద్ విమోచన దినోత్సవంగా  జరుపుకోవాలనే డిమాండ్  ప్రజల నుండి నెలకొంది.ఇప్పుడు హైద్రాబాద్ ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడం కోసం యువతలో దేశభక్తిని పెంపోదించడం కోసం భారత ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీని హైద్రాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది.

also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైద్రాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో చేరాలని ప్రతిపాదించారని చెబుతారు. ఈ ప్రాంతాన్ని భారత యూనియన్ లో విలీనం చేసేందుకు  రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు ధైర్యంగా పోరాటం నిర్వహించారు.1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సైనిక చర్యతో నిజాం పాలనలో ఉన్న అప్పటి  హైద్రాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనమైంది.

also read:లైవ్‌లోనే సహోద్యోగికి ప్రపోజ్: వైరలైన వీడియో

హైద్రాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా  నరేంద్ర మోడీ ప్రభుత్వం గత రెండేళ్లుగా  ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమానికి  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.


 

click me!