సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో సారవంతమైన భూములు జహీరాబాద్ సొంతం. కాంగ్రెస్ కురువృద్ధుడు, ఇందిరాగాంధీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన బాగారెడ్డి జహీరాబాద్‌కు చెందినవారు కావడం విశేషం. కర్ణాటక సరిహద్దుకు సమీపంలో వుండటంతో వీరశైవ లింగాయత్ సామాజికవర్గం ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. పార్టీ ఏదైనా గెలిచేది, గెలిపించేది ఆ సామాజికవర్గానికి చెందినవారే. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ సెగ్మెంట్ పరిధిలో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి .. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్, అంధోల్, జహీరాబాద్ వున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్‌ను తిరిగి దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. వరుసగా రెండు సార్లు ఇక్కడ విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి జహీరాబాద్‌లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది.
కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని వుండే పార్లమెంట్ నియోజకవర్గం జహీరాబాద్. మూడు ప్రాంతాల సంస్కృతులకు ఈ ప్రాంతం కేంద్రంగా భాసిల్లుతోంది. చెరకు సాగుకు జహీరాబాద్ దేశంలోనే ప్రసిద్ధి చెందింది. అల్లం, బంగాళాదుంప ఇతర వాణిజ్య పంటలు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. కర్ణాటక సరిహద్దుకు సమీపంలో వుండటంతో వీరశైవ లింగాయత్ సామాజికవర్గం ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. పార్టీ ఏదైనా గెలిచేది, గెలిపించేది ఆ సామాజికవర్గానికి చెందినవారే. సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో సారవంతమైన భూములు జహీరాబాద్ సొంతం. కాంగ్రెస్ కురువృద్ధుడు, ఇందిరాగాంధీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన బాగారెడ్డి జహీరాబాద్‌కు చెందినవారు కావడం విశేషం.
జహీరాబాద్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. బీఆర్ఎస్ కంచుకోట :
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ సెగ్మెంట్ పరిధిలో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి .. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్, అంధోల్, జహీరాబాద్ వున్నాయి. వీటిలో మూడు స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్. 2009లో కాంగ్రెస్ , 2014, 19లలో బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నుంచి గెలిచాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 14,98,666 మంది. వీరిలో పురుషులు 7,60,462 మంది.. మహిళలు 7,38,143 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌లో 10,44,365 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 69.69 శాతం పోలింగ్ నమోదైంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2, బీజేపీ ఒక చోట గెలిచాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి బీబీ పాటిల్‌కు 4,34,244 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి మదన్ మోహన్ రావుకు 4,28,015 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి బాణాల లక్ష్మారెడ్డికి 1,38,947 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 6,229 ఓట్ల మెజారిటీతో జహీరాబాద్‌ను కైవసం చేసుకుంది.
దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్‌ను తిరిగి దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌ను అభ్యర్ధిగా ప్రకటించింది. బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, రాజకీయ అనుభవం, నియోజకవర్గంలో విస్తృత పరిచయాలను దృష్టిలో వుంచుకుని సురేష్‌ను ఎంపిక చేసింది. బీజేపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీలో చేరడంతో కమలనాథుల్లో జోష్ వచ్చింది. పార్టీలో చేరిన వెంటనే జహీరాబాద్ టికెట్ ఖరారు చేసింది బీజేపీ.
జహీరాబాద్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. లింగాయత్‌లదే ఆధిపత్యం :
వరుసగా రెండు సార్లు ఇక్కడ విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి జహీరాబాద్‌లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరడంతో మరో బలమైన అభ్యర్ధిని వెతికే పనిలో పడ్డారు కేసీఆర్. గాలి అనిల్‌కు దాదాపుగా టికెట్ ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బలంగా వున్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అనిల్ ఖచ్చితంగా గెలుస్తారని కేసీఆర్ వ్యూహం. బీజేపీ, కాంగ్రెస్‌లు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఖరారు చేయడంతో కేసీఆర్ మున్నూరు కాపులకు గాలం వేశారు.