మిథానీలో టైటానియం వ్యర్థాలు అక్రమంగా విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

By narsimha lode  |  First Published Jun 3, 2022, 5:36 PM IST


హైద్రాబాద్ మిథానీలో నిబంధనలకు విరుద్దంగా సామాన్లను విక్రయిస్తున్న ఆరుగురిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సామాన్లు విక్రయిస్తున్న ఇద్దరు ఏజీఎం కానిస్టేబుళ్లను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


హైదరాబాద్: Hyderabad నగరంలోని Midhaniకి చెందిన టైటానియం వ్యర్థాలను విక్రయిస్తున్న వారిని శుక్రవారం నాడు CBI  అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  కంచన్ బాగ్ లో మిధాని డిపోలో శుద్ది చేసిన తర్వాత వచ్చే వ్యర్ధాలను అక్రమంగా ఉద్యోగులు అమ్ముతున్నారు మిథానీ డిపోపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది.  టైటానియం వ్యర్థాలను బయటకు అమ్ముకుంటున్నారు సిబ్బంది. Scrap గోడౌన్ యజమానులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని సీబీఐ అధికారులు గుర్తించారు.  ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన SPF  అసిస్టెంట్ కమాండెంట్ రవీందర్ రెడ్డి,కానిస్టేబుల్ శేరిపల్లి ప్రేమ్ కుమార్ తో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్ట్ చేశారు. స్క్రాప్ ను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ఇద్దరు యజమానులను అరెస్ట్ చేశారు.  950 కిలోల విలువైన వస్తువులను అక్రమంగా తరలిస్తున్న సమయంలో సీబీఐ అధికారులు పట్టుకున్నారు.  హైద్రాబాద్ లోని మిధానీతో పాటు ఆరు చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేశారు. 

Latest Videos

click me!