సామ రంగారెడ్డిపై కేసు నమోదు... రూ.40 కోట్లు కాజేశారని అభియోగం

By sivanagaprasad kodatiFirst Published Nov 24, 2018, 7:45 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నేత, ఇబ్రహీంపట్నం ప్రజాకూటమి అభ్యర్థి సామ రంగారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది.. తనను మోసం చేసి రూ.40 కోట్లు కాజేశారంటూ ఆయన బంధువు లక్ష్మారెడ్డి కేసు పెట్టారు. 

తెలుగుదేశం పార్టీ నేత, ఇబ్రహీంపట్నం ప్రజాకూటమి అభ్యర్థి సామ రంగారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది.. తనను మోసం చేసి రూ.40 కోట్లు కాజేశారంటూ ఆయన బంధువు లక్ష్మారెడ్డి కేసు పెట్టారు.

హైదరాబాద్ నాదర్‌గూడకు చెందిన లక్ష్మారెడ్డి తన మిత్రుడు రాజ్‌కుమార్‌తో కలిసి 13 ఏళ్ల క్రితం ఓ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు. 2009లో సామ రంగారెడ్డి ఆయన భార్య, ఆయన బంధువు సాయి విక్రమ్‌రెడ్డి ఈ సంస్థలో భాగస్వాములయ్యారు.

ఈ క్రమంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన రంగారెడ్డి...తన అనుమతితోనే సాయి విక్రమ్ రెడ్డిని సంస్థలోకి తీసుకున్నట్లు నమ్మించారని లక్ష్మారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి భూముల క్రయవిక్రయాల్లో తనను పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు.

మాదాపూర్‌లో మూడేళ్ల క్రితం ఓ అపార్ట్‌మెంట్ నిర్మించగా తన ప్రమేయం లేకుండా అందులో 4 అంతస్తులను రంగారెడ్డి తన కుమార్తె, అల్లుడు, వియ్యంకుడు, మరో బంధువుకు విక్రయించారని.. దాని విలువ రూ.40 కోట్లు ఉంటుందని లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు రంగారెడ్డిపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇబ్రహీంపట్నంపై టీడీపీ ట్విస్ట్: మ‌ల్‌రెడ్డికి రమణ వినతి

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

టీడీపి అభ్యర్థి సామ రంగారెడ్డికి మరోసారి షాక్

తీవ్ర అసంతృప్తి: సామకు బాబు బుజ్జగింపులు, తప్పని రెబెల్ బెడద

click me!