టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ ప్రీ పోల్ సర్వే: ఎదురులేని కేసీఆర్

By pratap reddyFirst Published Nov 23, 2018, 9:45 PM IST
Highlights

తెలంగాణ శానససభ ఎన్నికల్లో కారు దూసుకుపోతుందని తాజాగా టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ ప్రీ పోల్ సర్వే తెలియజేస్తోంది. ప్రజా కూటమిని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నట్లు తేల్చింది.

హైదరాబాద్: తెలంగాణ శానససభ ఎన్నికల్లో కారు దూసుకుపోతుందని తాజాగా టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ ప్రీ పోల్ సర్వే తెలియజేస్తోంది. ప్రజా కూటమిని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నట్లు తేల్చింది. 

టీఆర్‌ఎస్ 70 సీట్లను గెలుచుకోనున్నట్టు టైమ్స్‌నౌ ప్రీ పోల్స్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 31 సీట్లను, టీడీపీ 2, మజ్లీస్ 8, బీజేపీ 3, ఇతరులు 5 సీట్లు గెలుచుకోనున్నట్లు సర్వే ప్రకటించింది. 
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని 45.27 శాతం ప్రజలు కోరుకుంటుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి 30.55, కోదండరాంకు 3.37 శాతం మద్దతు లభించింది. 

టీఆర్‌ఎస్‌కు 37.55 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 27.98 శాతం, టీడీపీకి 5.66, ఎమ్‌ఐఎమ్‌కు 4.10 శాతం, బీజేపీకి 11 శాతం, ఇతరులకు 13.71 శాతమని సర్వే వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని 45.73 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వైపు 32.90 శాతం ప్రజలు ఉన్నారని సర్వే వెల్లడించింది. తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసిందని 52.44 శాతం ప్రజలు తెలిపినట్లు సర్వే వెల్లడించింది.

2014 లో టీఆర్‌ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం 34.30. ఈసారి 37.55 శాతం రానున్నట్టు సర్వే తెలిపింది. అంటే 3.25 శాతం ఓట్ల శాతం టీఆర్‌ఎస్‌కు పెరిగినట్లు అర్థమవుతోంది. టీడీపీకి 2014 లో 14.70 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 5.66 శాతం ఓట్లే వస్తాయని సర్వే తేల్చింది. 

click me!