ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎం వాళ్లే దొరికారా: కేసీఆర్‌పై రాజాసింగ్ కామెంట్స్

Published : Jan 19, 2019, 12:22 PM ISTUpdated : Jan 19, 2019, 12:23 PM IST
ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎం వాళ్లే దొరికారా: కేసీఆర్‌పై రాజాసింగ్ కామెంట్స్

సారాంశం

ఎంఐఎం శాసనసభ్యుడు స్పీకర్ ఛైర్‌లో ఉండగా ప్రమాణం చేయనని చెప్పి అసెంబ్లీకి గైర్హాజరైన గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మూడవ రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఆయనతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 

అనంతరం రాజాసింగ్ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనని, నూతన స్పీకర్ పోచారం సమక్షంలో ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశానని తెలిపారు.

ఎంఐఎం ఎమ్మెల్యేలు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని.. అటువంటి వారిని ప్రొటెం స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టినందుకు సీఎం కేసీఆర్ ఒకసారి ఆలోచించాలన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే.. అందరినీ కలుపుకుని వెళ్లాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. 

అసెంబ్లీకి గైర్హాజరు, మాటకు కట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ఎంఐఎం‌కు ప్రొటెం స్పీకర్: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనన్న రాజాసింగ్

మజ్లీస్ ఎక్కడుంటే అక్కడ నష్టమే...కేసీఆర్ కు రాజాసింగ్ సలహా

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు