‘పసుపు రంగు’ లేకుండా చేద్దామనుకున్నా.. కేటీఆర్ కామెంట్స్

By ramya neerukondaFirst Published Jan 19, 2019, 12:16 PM IST
Highlights

తాజాగా.. ఆయన పసుపు చొక్కా పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కి వాక్చాతుర్యం కాస్త ఎక్కువే. సందర్భానుసారంగా మాట్లాడటంలో ఆయన దిట్ట. ఎవరిమీదైనా సునాయాసంగా.. అర్థవంతంగా అప్పటికప్పుడే పంచులు వేయడంలో ఆయన నేర్పరి. ఆయన మాటలకే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తిలేదు. తాజాగా.. ఆయన పసుపు చొక్కా పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం సభ వాయిదా పడ్డ తర్వాత కొంతమంది జర్నలిస్టులు కేటీఆర్‌ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో సరదాగా ముచ్చటించారు.

 ఆ సమయంలో ఓ జర్నలిస్టు పసుపు రంగు చొక్కా వేసుకుని ఉండటాన్ని గమనించి.. 'పసుపు రంగే లేకుండా చేద్దామనుకుంటుంటే.. అదే రంగు చొక్కాతో వచ్చావా?' అంటూ కామెంట్ చేశారు. దీంతో పసుపుపచ్చ రంగు ప్రకృతిలో భాగమే కదా అని సదరు జర్నలిస్టు బదులిచ్చారు. ఆ మాటకు బదులిచ్చిన కేటీఆర్.. 'ప్రకృతే కదా.. వికృతి అయితే కాదు కదా..' అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. టీడీపీ ని ఉద్దేశించే కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారని ఈపాటికే అందరికీ అర్థమయ్యి ఉంటుంది. 

click me!