లాల్‌దర్వాజ మహంకాళికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు

By narsimha lodeFirst Published Aug 12, 2018, 5:36 PM IST
Highlights

 ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి  ఆదివారం నాడు బంగారు బోనం సమర్పించారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబసభ్యులతో కలిసి పీవీ సింధు ఆలయం వద్దకు వచ్చారు.


హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి  ఆదివారం నాడు బంగారు బోనం సమర్పించారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబసభ్యులతో కలిసి పీవీ సింధు ఆలయం వద్దకు వచ్చారు.

సంప్రదాయ దుస్తుల్లో పీవీ సింధూ బోనమెత్తుకొని ఆలయానికి వచ్చారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను ఎప్పుడైనా అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటానని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని పీవీ సింధూ అభిప్రాయపడ్డారు.

బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ పోటీల  కారణంగా  తాను బోనాల ఉత్సవాల్లో పాల్గొనలేకపోయినట్టు ఆమె చెప్పారు.  ఈ పోటీలు పూర్తైనందున ఇవాళ అమ్మవారికి బోనం సమర్పించినట్టు ఆమె చెప్పారు. 

ఇటీవల జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో ఆమె ఓటమిపాలయ్యారు. ఫైనల్ లో ఆమె విజేతగా నిలుస్తారని భావించినప్పటికీ ఆ పోటీలో ఆమె ఓటమి పాలైంది.  ఈ పోటీ నుండి తిరిగి వచ్చిన  సింధు  ఆదివారం నాడు అమ్మవారికి బోనం సమర్పించారు.
 

click me!