ఘట్కేసర్ కిడ్పాప్, రేప్ డ్రామా ఆడిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

By telugu teamFirst Published Feb 24, 2021, 11:26 AM IST
Highlights

ఘట్కేసర్ లో తనను ఆటో డ్రైవర్లు అపహరించి, తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ కట్టుకథ అల్లిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షుగర్ టాబ్లెట్స్ మింగి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్: తనను కిడ్పాప్ చేసి ఆటో డ్రైవర్లు తనపై వాహనంలో అత్యాచారం చేశారని కట్టుకథ అల్లిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

అందరి ముందు ఆభాసుపాలయ్యానని మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన  తర్వాత ఆమె అమ్మమ్మ ఇంట్లోనే ఉంటూ వచ్చింది. యువతి పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించినట్లు దర్యాప్తులో తేలింది. బుధవారం ఉదయం షుగర్ ట్యాబ్లెట్లు మింగింది. ఆమెను ఘట్కేసర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

యువతి మృతదేహం ప్రభుత్వాస్పత్రిలో ఉంది. మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఘట్కేసర్ లో తనను ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని, ఆ తర్వాత మరో ముగ్గురితో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశారని ఓ యువతి కట్టుకథ అల్లిన విషయం తెలిసిందే. ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి చెప్పిన విషయాలన్నీ కట్టుకథలని పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, శాస్త్రియమైన విశ్లేషణలు చేసి యువతి కట్టుకథ అల్లిందని, ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. 

See Video: ఘట్కేసర్ కిడ్నాప్, రేప్ కట్టుకథ: ఆటో డ్రైవర్ మీద యువతికి కక్ష

రాంపల్లి ఆర్ఎల్ నగర్ కు చెందిన విద్యార్థిని కాలేజీ నుంచి తిరిగి వచ్చే సమయంలో తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకుని వెళ్లాడని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. దాంతో యువతి తల్లి 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సెల్ ఫోన్ సంకేతాల ఆధారంగా అన్వేషణ ప్రారంభించి యువతిని కనిపెట్టారు. 

Also Read: ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని కేసులో భారీ ట్విస్ట్ తేల్చేసిన రాచకొండ సీపీ

ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత వారిని వదిలిపెట్టారు. వారికి రాచకొండ సీపీ మహేష్ భగవత్ సారీ కూడా చెప్పారు. అత్యాచారం ఎక్కడ జరిగిందనే విషయం గురించి యువతి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. ఇంటి నుంచి వెళ్లిపోవడానికి మాత్రమే యువతి కిడ్పాన్, అత్యాచారం కథ అల్లిందని పోలీసులు గుర్తించారు. 

click me!