నిజామాబాద్ లో ఘోరం.. కన్న తల్లిని రోకలి బండతో కొట్టి హతమార్చిన కూతురు

By Asianet NewsFirst Published May 29, 2023, 7:05 AM IST
Highlights

క్షణికావేశంలో ఓ కూతురు తన కన్న తల్లినే హతమార్చింది. రోకలి బండతో బాది హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గ్రామంలో చోటు చేసుకుంది.

ఓ కన్నకూతురు తన తల్లి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. రోకలి బండతో కొట్టి హతమార్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులకు ఈ విషయం తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్రిక్తంగా మారిన రెజ్లర్ల ఆందోళన.. బలవంతంగా వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, పూనియాల అరెస్టు.. వీడియో వైరల్

వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట్‌ మండలం ఉమ్మెడ గ్రామానికి చెందిన 52 ఏళ్ల నాగం నర్సు తన భర్తతో కలిసి జీవించేది. అయితే భర్త 20 ఏళ్ల కిందట చనిపోయారు. దీంతో ఆమె ఒంటరిగానే ఉంటూ.. జీవనోపాధి కోసం కూలి పనులు చేస్తుండేది,. అయితే ఆమె ఇంట్లోనే ఓ గదిలో 28 ఏళ్ల కూతురు హరిత కూడా వేరుగా జీవించేది. అయితే కొన్ని సంవత్సరాలుగా తల్లి, కూతురు మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. 

పార్లమెంటును శవపేటికతో పోల్చడం తప్పు - అసదుద్దీన్ ఒవైసీ.. ఆర్జేడీ తీరుపై ఫైర్

ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన నర్సు రెండో కూతురు అరుణ నివాసంలో ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫంక్షన్ కు వచ్చిన వారిని నర్సు తిట్టింది. ఈ విషయంలో హరితకు, నర్సుకు గొడవ మొదలైంది. ఇది తీవ్ర వాగ్వాదంగా మారింది. క్షణికావేశంలో తల్లిని కూతురు రోకలి బండతో తీవ్రంగా బాది అక్కడి నుంచి వెళ్లింది. 

కొత్త పార్లమెంటును ప్రశంసించిన షారుఖ్ ఖాన్ పై కాంగ్రెస్ ఫైర్.. ఇక ‘కింగ్’ లేరంటూ విమర్శలు..

తెల్లారి తల్లితో జరిగిన గొడవ, తను చేసిన పనిని హరిత తన చెల్లెలు అరుణకు, ఇతర బంధువులకు ఫోన్ చేసి వివరించింది. దీంతో హుటా హుటిన అరుణ, బంధువులు నర్సు ఇంటికి వచ్చి మధ్యాహ్నం సమయంలో చూశారు. కానీ అప్పటికే ఆమె చనిపోయి కనిపించింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. నర్సు మేనల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

click me!