
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్‌కు ఈటల రాజేందర్ మెజారిటీ పెరుగుతుండటంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేసిన అమిత్.. ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈటల విజయం దిశగా ముందుకు సాగడంపై అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని bandi sanjayకి సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే బీజేపీ విజయం సాధించిందని Amit Shah అన్నారు.
ఈటల రాజేందర్ విజయం దూసుకెళ్తున్న సమయంలో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదని అన్నారు. ఈటల ఘన విజయం సాదించబోతున్నారని తెలిపారు. దళిత బంధు అమలు చేసిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. ఈటల బీజేపీ నాయకుడని.. ఆయన గెలుపు బీజేపీదని.. బీజేపీ గెలుపు ఈటల గెలుపే అని వ్యాఖ్యానించారు.
Also read: శత్రువుకు శత్రువు మిత్రుడు.. మాకు తప్పలేదు.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్..
ఇక, Huzurabad Bypoll ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫలితానికి సంబంధించి ఇప్పటివరకు 15 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. అందులో 13 రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరచగా.. 2 రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాద్ అధిక్యం సాధించారు. ఇప్పటివరకు ఈటల 11,583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో 7 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్..
బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు..
ఈటల విజయం దిశగా దూసుకెళ్లడంతో తెలంగాణలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికను టీఆర్‌ఎస్, బీజేపీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద డ్యాన్స్‌లు చేస్తూ బీజేపీ శ్రేణులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి తరలివస్తున్నారు. స్వీట్స్ పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
Also read: టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?
ఇక, హుజురాబాద్‌లో జరిగిన ఎన్నిక తెరాస వర్సెస్ బీజేపీ గా కన్నా ఈటెల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి. పూర్తిగా పోలరైజ్డ్ గా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి కనబడడం లేదు. అయితే మరికొన్ని గంటల్లోనే హుజురాబాద్ విజేత ఎవరనేది అధికారికంగా తేలిపోనుంది.