huzurabad by poll : డిపాజిట్ వస్తే రేవంత్ ఛరిష్మా, లేదంటే సీనియర్ల ఖాతాల్లోకే ... జగ్గారెడ్డి వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 2, 2021, 3:53 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికలు (huzurabad by poll) ఫలితాలు టీఆర్ఎస్ (trs) కంటే కాంగ్రెస్‌లో (congress) ఎక్కువ కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్ధంగా వున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. 


హుజురాబాద్ ఉపఎన్నికలు (huzurabad by poll) ఫలితాలు టీఆర్ఎస్ (trs) కంటే కాంగ్రెస్‌లో (congress) ఎక్కువ కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని రేవంత్ రెడ్డి (revanth redy) , భట్టి విక్రమార్కలు (bhatti vikramarka) బలి పశువును చేశారని జగ్గారెడ్డి (jagga reddy)ఆరోపించారు. డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్ధంగా వున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

అంతకుముందు హుజురాబాద్ ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయని పొన్నం అన్నారు. అప్రజాస్వామికంగా మంత్రి వర్గం నుంచి తొలగించారనే అంశాన్ని ఈటల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని ప్రభాకర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోయారని.. ఇది బీజేపీ విజయంగా బండి సంజయ్ చెప్పడం దురదృష్టకరమని పొన్నం ఎద్దేవా చేశారు. ఈటల గెలవాలని బండి సంజయ్ (bandi sanjay) కోరుకోలేదని.. ఈటల రాజేందర్ ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థి అని చెప్పుకోలేదని, ఇది పూర్తిగా ఈటల గెలుపేనని ప్రభాకర్ అభివర్ణించారు. కాంగ్రెస్ ఓటమి ముందే ఊహించిందేనని.. ఉత్తమ్ పీసీసీగా (uttam kumar reddy) ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి (koushik reddy) మీద దృతరాష్ట్రుడి ప్రేమ చూపించారని ఆయన ఆరోపించారు. అంతిమంగా అది కాంగ్రెస్ (congress) పార్టీకి నష్టం చేసిందని.. రేవంత్ రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Latest Videos

undefined

ALso Read:huzurabad by poll: ఈటల గెలుపు, కాంగ్రెస్ ఓటమి .. ఊహించినదే, రేవంత్ వల్ల కాలేదు : పొన్నం వ్యాఖ్యలు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) సైతం కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పరిస్ధితిపై సంచలన కామెంట్స్‌ చేశారు. శత్రువుకు శత్రువు మిత్రుడు.. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటల రాజేందర్ (Etela Rajender) మేం మద్దతు ఇవ్వక తప్పలేదని రాజకీయంగా తీవ్ర చర్చను లేవనెత్తారు. ఉప ఎన్నిక ఫలితాలపై స్పందించిన కోమటిరెడ్డి.. ఈ ఎన్నిక కోసం టీఆర్‌ఎస్ పార్టీ భారీగా డబ్బులు ఖర్చు చేసిందని ఆరోపించారు. కేవలం 5 నెలల్లోనే 5 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. భారీగా డబ్బు పంచినా.. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్‌కు గట్టి షాక్ ఇచ్చే తీర్పు ఇస్తున్నారని అన్నారు. ఈటల రాజేందర్ 30 వేల మెజారిటీతో విజయం సాధించబోతున్నాడని అన్నారు. 

ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) భారీ షాకివ్వబోతున్నట్టుగా చెప్పారు. శుత్రువుకు శ్రతువు మిత్రుడనే కోణంలో తాము ఈటలకు మద్దతిచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. తాము గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి ఉండేవని.. అలా జరిగితే టీఆర్‌ఎస్ లాభపడేదని వ్యాఖ్యానించారు. ఈటలకు పరోక్షంగా మద్దతిచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలతో తాము ఏకీభించడం లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. తాము బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. హుజురాబాద్‌లో గెలుపు బీజేపీది కాదని.. ఈటల రాజేందర్‌ది అని అన్నారు.
 

click me!