జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సామూహిక అత్యాచారం అనంతరం.. బాలికను పబ్ లో వదలడానికి వచ్చినప్పుడు.. బేస్మెంట్ లో మరోసారి బాలిక మీద వేధింపులకు పాల్పడ్డారు నిందితులు.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో ఎస్‌యూవీలో సామూహిక అత్యాచారం జరగడంతోనే ఆ సంఘటన ముగిసిపోలేదు. అత్యాచారం అనంతరం 17 బాధిత బాలికను పబ్ దగ్గర వదిలేందుకు వచ్చిన సమయంలో.. నిందితులు పబ్‌లోని బేస్‌మెంట్‌లో ఆమెను మళ్లీ వేధించారని పోలీసులు తెలిపారు. “SUV లోపల ఆమెపై లైంగిక వేధింపులు జరిపిన తర్వాత, ఆమెను డ్రాప్ చేయడానికి SUVలోనే పబ్‌కు వచ్చినప్పుడు నిందితుల్లో కొందరు ఆమెపై మళ్లీ వేధింపులకు పాల్పడ్డారు. ఇది పబ్ బేస్మెంట్ లో జరిగింది, అక్కడే ఆమెను బెదిరించి, వదిలేసి వెళ్లిపోయారు. అక్కడినుంచే ఆమె తండ్రి ఆమెను తీసుకెళ్ళాడు, ”అని ఒక సమాచారం.
లీక్ అయిన అత్యాచారం వీడియోలో లగ్జరీ సెడాన్ లోపల కొంతమంది నిందితుల ఈ ఘటనను వీడియో తీయాలని మాట్లాడుకోవడం.. వాహనం నడుపుతున్న వ్యక్తి.. మైనర్ ను వీడియో తీయమని ప్రోత్సహించడం అందులో కనిపిస్తుంది. తాను డ్రైవింగ్ చేస్తున్నందున మరో మైనర్ ను ఇదంతా వీడియో తీయమన్నాడని సమాచారం. సోమవారం ఉదయం, సామూహిక అత్యాచారం కేసులో 18 ఏళ్ల నిందితుడిని నాలుగు రోజుల కస్టడీ విచారణ తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన చట్టం (CCL)తో వివాదంలో ఉన్న ఐదుగురు పిల్లలను పోలీసులు జూబ్లీహిల్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించారు. అంతకుముందు రోజు, రాత్రి జువైనల్ హోం వద్ద మైనర్‌ల మధ్య జరిగిన గొడవ జరిగిందని వచ్చిన వార్తల మీద సోషల్ మీడియా మండిపడింది.
undefined
అమ్నీషియా పబ్ రేప్ కేస్.. ఇంగ్లీష్ సినిమాలు,వెబ్ సిరీస్ లు చూసి.. అందరం అనుకునే అలా చేశాం..
అయితే అలాంటి ఘటనేమీ జరగలేదని జువైనల్ హోం అధికారులు స్పష్టం చేశారు. పుప్పాల్‌గూడకు చెందిన 18 ఏళ్ల నిందితుడి తండ్రి గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు.యువకుడు ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 7వ తరగతి వరకు సౌదీ అరేబియాలో చదివి, తర్వాత హైదరాబాద్‌లో చదువు కొనసాగించారు. మిగతా నలుగురు మైనర్లతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరులోని ఓ ప్రార్థనా స్థలం నుంచి పట్టుబడ్డ మైనర్ ప్రధాన నేరస్తుడు అని 18 ఏళ్ల యువకుడు చెప్పాడు. "ఈ యువకుడు బాధిత బాలికను తనతోపాటు పబ్ నుంచి బెంజ్‌లో తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు, కానీ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు అతని కంటే ముందుగా ఆమెతో పరిచయం చేసుకుని, మాయచేసి ఇన్నోవాలో రావాలని కోరాడని’ అని ఒక ఇన్వెస్టిగేటర్ చెప్పారు.
ఈ ఘటనలో బయటపడిన బాధిత బాలికపై తొలుత అత్యాచారం చేసిన మైనర్ నగర కార్పొరేటర్ కొడుకు కాదని, అతని తండ్రి వ్యాపారవేత్త అని ఆమె పోలీసులకు తెలిపింది. విచారణ అనంతరం సాయంత్రం ఐదుగురు మైనర్లను జువైనల్ హోమ్‌కు పంపిన పోలీసులు మంగళవారం మళ్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. పోక్సో చట్టం ప్రకారం ప్రతి కేసులోనూ 60 రోజుల్లో అభియోగ పత్రాలు సమర్పించాలన్న నిబంధన ఉండటంతో అందులో పొందుపరచాలి అంశాలపైనా దృష్టి కేంద్రీకరించారు.