అమెరికాలో హైదరాబాద్ కు చెందిన వివాహిత ఆత్మహత్య.. ఎందుకంటే ?

By Asianet News  |  First Published Sep 2, 2023, 12:30 PM IST

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన ఓ వివాహిత తన భర్తతో కలిసి అమెరికాలోని మిస్సోరిలో ఉంటున్నారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె అక్కడే ఆత్మహత్యకు ఒడిగట్టారు. 


అమెరికాలో హైదరాబాద్ కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం మధ్యాహ్నం బలవన్మరణానికి ఒడిగట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌ ప్రాంతంలోని సూర్యోదయ కాలనీలో ఏనుగు మల్లారెడ్డి తన భార్య అనసూర్యతో కలిసి నివసిస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామం వీరి స్వస్థలం.

వివాహేతర సంబంధాల వల్ల కలిగిన పిల్లలకూ.. ఆస్తిలో వాటా - సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Latest Videos

ఈ దంపతులకు శ్రీనివాస్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాయి. ఆయనకు 18 ఏళ్ల కిందట కవిత అనే మహిళను ఇచ్చి పెళ్లి జరిపించారు. అయితే శ్రీనివాస్ రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా పని చేస్తున్నారు. ఆయన తన భార్యతో కలిసి అమెరికాలోని మిస్సోరిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే కవితకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనిని తట్టుకోలేక ఆమె గురువారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బాలికపై యువకుడి అత్యాచారం.. ఈ విషయం అందరికీ చెబుతానంటూ అతడి స్నేహితుడు కూడా..

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 
 

click me!