
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో.. ఆ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తుమ్మలతో భేటీ రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ఆయనను కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే, తాజాగా కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు.
అయితే ఈ ఇరువులు నేతలు బీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ ఏనాడూ బహిరంగంగా పలకరించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో తుమ్మల నివాసానికి పొంగులేటి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు అప్యాయంగా పలకరించనున్నారు. ఈ సందర్భంగా తాజాగా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చల జరిపారు. తమ్ములను కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా పొంగులేటి ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు.
ఈ భేటీ అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ నేత అని, ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉందని అన్నారు. ఏ పార్టీలో ఉన్న ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచేశారని చెప్పారు. బీఆర్ఎస్‌లో పొమ్మన లేకుండా పొగబెట్టి.. అవమానానాలకు గురిచేశారని అన్నారు. ముందుగా తనను బయటకు పంపిచారని.. ఇప్పుడు తుమ్మలను బయటకు వెళ్లేలా చేశారని విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావును, వారి మిత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా చెప్పారు. అయితే ఇది తుమ్మల నాగేశ్వరరావు ఒంటరిగా తీసుకునే నిర్ణయం కాదని.. ప్రజలు, అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారని అన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. ఆయన ఏ రంగంలో ఉన్న తాను శ్రేయోభిలాషినని.. ఆయన కూడా తనకు శ్రేయోభిలాషి అని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నది ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకేనని చెప్పారు. జిల్లాను అభివద్ది చేసుకుంటూ.. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని అభివృద్ది చేసుకుంటూ ముందుకు సాగానని చెప్పారు. 40 ఏళ్లుగా జిల్లా అభివృద్దికి శక్తి వంచన లేకుండా పనిచేశానని తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటి ఆహ్వానించారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను విడుదల చూడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. తదుపరి నిర్ణయాలు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రకటించనున్నట్టుగా చెప్పారు.