
ఆ దంపతులకు ఎన్నో ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. కష్టాలు, సుఖాలు కలిసి పంచుకున్నారు. చివరిదాకా తోడు నీడగా ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. వారికి పెళ్లిలు చేశారు. వారు కూడా పెద్దవాళ్ల అయ్యారు. వృద్ధాప్యంలోనూ ఒకరికొకరు తోడు నిలిచారు. ఆ వయస్సులోనూ ఎంతో అనోన్యంగా జీవించేవారు. ఎన్నో యువ జంటలకు వారు ఆదర్శంగా ఉండేవారు. అయితే ఇటీవల వారిలో ఒకరు వయోభారంతో కన్నుమూశారు. దీనిని తట్టుకోలేక మరొకరు కూడా తుదిశ్వాస విడిచారు.
విషాదం.. పొలంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న రైతుపై ఏనుగు దాడి.. కాలితో తొక్కడంతో మృతి
ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన 103 ఏళ్ల రాయల అప్పయ్య, 96 ఏళ్ల తిరుపతమ్మ దంపతులు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉంది. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారిద్దరికి కూడా పిల్లలు జన్మించారు. ప్రస్తుతం ఈ వృద్ధ దంపతులు ఇద్దరూ అదే గ్రామంలో కుమారుడి వద్ద ఉంటున్నారు
త్వరలో ఉల్లి ధరలు పెరిగే ఛాన్స్.. కేంద్రం కీలక నిర్ణయం , ఎగుమతులపై భారీగా సుంకం.
ఈ క్రమంలో రెండు రోజుల కిందట తిరుపతమ్మకు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి సమయంలో కన్నుమూశారు. దీంతో అప్పుడే ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వచ్చారు.
హిమాచల్ వర్ష బీభత్సంతో ఇప్పటివరకు 78 మంది మృతి.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ
అయితే మూడు రోజుల కిందటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఇంట్లో ఉన్న భార్య.. ఇలా విగతజీవిగా పడుకొని ఉండటాన్ని చూసి అప్పయ్య తట్టుకోలేకపోయాడు. ఆమె భౌతికకాయాన్ని చూస్తూ బోరున ఏడ్చాడు. ఎన్నో ఏళ్ల వారి ద్యాంపత్య జీవితంలో ఎప్పుడూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేదు. ఇక భార్య తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని, ఎప్పటికీ తిరిగిరాదనే విషయం తలుచుకుంటూ ఆయన విలపించారు. ఇలా ఏడుస్తూనే తిరుపతమ్మ మృతదేహం వద్ద కుప్పకూలి చనిపోయాడు.
మనీలాండరింగ్ కేసు: ఈ నెల 24న హాజరుకావాలని హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు
ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ వృద్ధ దంపతులిద్దరూ ఒకే సారి చనిపోవడంతో ఆ గ్రామం మొత్తం కన్నీరుమున్నీరయ్యింది. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య అక్కడికి చేరుకొని, బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఇతర ప్రజాప్రతినిధులు కూడా మృతదేహాలను సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వృద్ధ దంపతులిద్దరి అంత్యక్రియలు శనివారం జరిగాయి.