కాంగ్రెస్ బూటకపు మాటలకు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు: కేటీఆర్

Published : Aug 20, 2023, 05:41 AM IST
కాంగ్రెస్ బూటకపు మాటలకు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు: కేటీఆర్

సారాంశం

Hyderabad: కాంగ్రెస్ బూటకపు మాటలకు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడిన ఆయన.. తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరుసగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించారు.  

BRS working president KTR: సంపద సృష్టించి పేదలకు అందించడమే భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) అన్నారు. కానీ ప్రతిపక్ష నేతల లక్ష్యం తమ కోసం సంపదను కూడబెట్టుకోవడమేనంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు తెలంగాణ భవన్ లో ఆయన సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ఇప్పుడు నెలకు రూ.4000వేలు పింఛన్ ఇస్తామని, 24 గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. "కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒక్క ఛాన్స్ కోసం యాచించే స్థాయికి వెళ్తున్నారు. కానీ అబద్ధపు హామీలతో మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ నేతలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. వారిని నమ్మొద్దంటూ" విమ‌ర్శించారు.

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరనీ, ప్రజలు తమ పార్టీకి ఓటేస్తారని ఎలా ఆశిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో తన స్థానం గురించి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్న తీరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధినేత తాను ప్రధాని అన్నట్లుగా గొప్పగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు, విభజనను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగిందని విమ‌ర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై తరచూ విమర్శలు చేసే పార్టీ నేతలు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ప్రజలకు భరోసా ఇవ్వడం ప్రారంభించారు.

అలాంటప్పుడు బీజేపీ అవసరం ఎక్కడుందని ప్రశ్నించిన ఆయన, కె.చంద్రశేఖర్ రావు వంటి సమర్థుడైన నాయకుడి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. తలకొండపల్లి గ్రామానికి చెందిన యువనేత ఉప్ప‌ల వెంకటేశ్ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించడాన్ని అభినందించిన ఆయన అందుకు ఏం చేశారో స్వయంగా తెలుసుకునేందుకు గ్రామాన్ని సందర్శిస్తానని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!