Achampet Election Result 2023: అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు

By narsimha lode  |  First Published Dec 3, 2023, 10:13 AM IST


నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్ధిగా  గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్ధిగా  చిక్కుడు వంశీకృష్ణ బరిలో దిగారు. 



హైదరాబాద్: అచ్చంపేట అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి చిక్కుడు వంశీకృష్ణ 49,326 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్ధి  గువ్వల బాలరాజుపై విజయం సాధించారు. 

నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది.  నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఈ నియోజకవర్గం ఉంటుంది.  శ్రీశైలం  పుణ్యక్షేత్రానికి ఈ నియోజకవర్గం గుండా వెళ్తారు.  అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం  ఎస్‌సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం.అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 22 శాతం  ఎస్ సీ జనాభా ఉంటారు.  

Latest Videos

undefined

also read:Huzurnagar assembly results 2023: హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..ఆధిక్యంలో ఉత్తమ్

18.65 శాతం ఎస్టీ జనాభా ఉంటారు.   అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 2,33,565 ఓటర్లున్నారు.  ఇందులో  1,17,124 మంది పురుషుల ఓటర్లు. 1,16,439 మహిళా ఓటర్లున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  2,14, 152 మంది ఓటర్లున్నారు. 2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి  అభ్యర్థి  గువ్వల బాలరాజు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై విజయం సాధించారు.  కాంగ్రెస్ అభ్యర్ధిపై  9,114 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి గువ్వల బాలరాజుకు  49.97 శాతం ఓట్లు దక్కాయి.

also read:Telangana Assembly Election Results 2023 LIVE : రేవంత్ రెడ్డి ఇంటికి డిజిపి అంజనీ కుమార్...

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్  30న  పోలింగ్ జరిగింది.  రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని భారత రాష్ట్ర సమితి అస్త్రశస్త్రాలను సంధించింది.  కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని  పార్టీ నాయకత్వం  ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో తెలంగాణలో  పట్టు సాధించాలని  బీజేపీ నాయకత్వం  అన్ని అస్త్రాలను ప్రయోగించింది.  ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీలు కలిసి పోటీ చేశాయి.  బీజేపీ  111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ,సీపీఐ మధ్య ఈ ఎన్నికల్లో పొత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో పోటీ చేయగా, సీపీఐ ఒక్క స్థానంలో బరిలోకి దిగింది.  ఈ ఎన్నికల్లో సీపీఐఎం, బీఎస్ పీ ఒంటరిగా బరిలోకి దిగింది.

 


 


 

click me!