ఇప్పటి వరకు కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు చాలా మంది ప్రస్తుతం లీడింగ్ లో ముందుకు దూసుకుపోతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎక్కువ స్థానంలో మెజార్టీలో దూసుకుపోతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు చాలా మంది ప్రస్తుతం లీడింగ్ లో ముందుకు దూసుకుపోతున్నారు.
నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొదటి రౌండ్ పూర్తి. అయ్యింది. 4000 ఓట్ల ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూసుకుపోతున్నాడు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క మొదటి రౌండ్లో 2022 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తొలి రౌండ్‌లో 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కాగా, ఈరోజు తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు. ఉదయం 8:30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అంతకముందు పోస్టల్ బ్యాలెట్ కౌటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువగా కాంగ్రెస్ కి ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో 119 స్థానాలకు పోలింగ్ జరిగింది. 60స్థానాల మెజార్టీ ఎవరు సాధిస్తే, వారే తెలంగాణ పీఠాన్ని అదిరోహిస్తారు.