ఈ టిప్స్ పాటిస్తే సరి: ఫోన్‌ పోయినా వాట్సాప్‌ ఖాతా భద్రం

By rajesh yFirst Published Dec 17, 2018, 11:09 AM IST
Highlights

అనుకోకుండా స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నా.. ఎవరన్నా కొట్టేసినా తమ వాట్సాప్ ఖాతా కొనసాగించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ముందుగా సర్వీస్ ప్రొవైడర్ కు కాల్ చేసి తన సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలని కోరితే చాలు.. మళ్లీ కొత్త సిమ్ కార్డు తీసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు.

న్యూఢిల్లీ: ఫోన్‌లో సిమ్‌కార్డు లేకున్నా వై-ఫై సర్వీసును ఉపయోగించడం ద్వారా వాట్సాప్‌ ఖాతాకు సందేశాలను పంపే అవకాశం ఉంది. వాట్సాప్‌ డేటాను బ్యాకప్‌ చేసుకోకుండా కొత్త ఫోన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది.

కానీ ఒకవేళ ఫోన్‌ పోయినా దొంగతనానికి గురైనా మన వాట్సాప్‌ ఖాతా, అందులోని సమాచారం భద్రంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి. మన ఫోన్‌ పోయినప్పుడు తొలుత మనం సర్వీస్‌ ప్రొవైడర్‌కు కాల్‌ చేసి సిమ్‌ కార్డును లాక్‌ చేయించాల్సి ఉంటుంది.

దీని ద్వారా ఫోన్‌లోని వాట్సాప్‌ ఆప్షన్‌ డిజేబుల్‌ అవుతుంది. ఆ సమయంలో ఫోన్‌ను వాడటం కుదరదు. ఒకవేళ యాక్టివేట్‌ చేయాలంటే మరో నెంబర్‌కు మెసేజ్‌ కానీ, ఫోన్‌ కానీ చేయాలి. ఒకవేళ కొత్త ఫోన్‌ తీసుకుంటే కొత్త సిమ్‌ కార్డుతో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఒకవేళ సిమ్‌ కార్డు యాక్టివేట్‌ అవడంలో ఆలస్యమైతే వాట్సాప్‌ కస్టమర్‌ కేర్‌కు ఈమెయిల్‌ పంపొచ్చు. ‘నా ఫోన్‌ పోయింది. ఖాతాను డీయాక్టివేట్‌ చేయండి’ అని మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. మెయిల్‌లో మన భారతదేశ కోడ్‌తో పాటు ఫోన్‌ నంబర్‌ను కూడా పంపాల్సి ఉంటుంది.

వాట్సాప్‌ ఖాతా డీయాక్టివేటైనా కూడా మన మిత్రుల కాంటాక్ట్స్‌ నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. నెల రోజుల పాటు ఆ మెసేజ్‌లు పెండింగ్‌లో ఉంటాయి. 30 రోజుల తర్వాత కూడా వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకోకపోతే ఖాతా శాశ్వతంగా డిలీట్‌ అయ్యే అవకాశం ఉంది.

click me!